పుట:Palle-Padaalu-1928.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలవారి కోడలు

——అవిభక్త కుటుంబమునందలి సౌందర్యమును వ్యక్తము చేస్తుంది. ఈ పాట వినండి.

కలవారి కోడలు కలికి కామాక్షి
కడుగుచున్నది పప్పు కడవలోపోసి
అప్పుడే ఏతెంచె ఆమెపెద్దన్న
కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీళ్ళు నింపె
ఎందుకు కన్నీళ్ళు ఏమికష్టమ్ము
తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు
ఎత్తుకోబిడ్డను ఎక్కు అందలము
మీఅత్తమామలకు చెప్పిరావమ్మ
కుర్చీ పీటమీద కూర్చున్న అత్తా
మాఅన్నలొచ్చారు మమ్మంపుతార ?
నేనెరుగ నేనెరుగ మీమామనడుగు
పట్టెమంచము మీద పడుకోన్నమామ
మాఅన్నలొచ్చారు మమ్మంపుతార
నేనెరుగ నేనెరుగ నీబావనడుగు
భారతముచదివేటి బావ పెదబావ
మా అన్నలొచ్చారు మమ్మంపుతార
నేనెరుగ నేనెరుగ నీఅక్క నడుగు
వంటచేసేతల్లి ఓఆక్కగారు
మాఅన్నలొచ్చేరు మమ్మంపుతార

110