పుట:Palle-Padaalu-1928.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిరిసిరి మువ్వపాట

——అయితే నగలతో సంతుష్టి చేకూరగలరా ఎన్నాళ్లు సవతి భాధ భరించగలదు

ఈముండ కాపురము ౹౹సిరిసిరి మువ్వ౹౹
నాకే ముండ తెచ్చింది ౹౹సి౹౹
అన్నపూర్ణ కాపురము ౹౹సి౹౹
కన్నవారి యిల్లుకాదా ౹౹సి౹౹
రంగమ్మ కాపురము ౹౹సి౹౹
రత్నాల మూటకాదా ౹౹సి౹౹
ప్రక్కపాపిడేలనని ౹౹సి౹౹
పక్కలిరగ తన్నేడే ౹౹సి౹౹
జాకెట్టు తొడిగితే ౹౹సి౹౹
షోకేలనని తన్నేడే ౹౹సి౹౹
పాకిదాని లాగుంటేని ౹౹సి౹౹
పకపక వాడు నవ్వేడే ౹౹సి౹౹

"కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !"