పుట:Palle-Padaalu-1928.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త్రీ:-దాని మాయలోను పడబోకు | నాయుడుబావ
దాని సోకులోను దిగబోకు | సుందర మగడ
దాని మాటలైన వినబోకు | సోకుదారి మగడ ౹౹ఏ౹౹

పు:-వడ్డాణ మిదిగోయె | వయ్యారి భామా
నీ నడుముకైన పెట్టుకోయె | సుందరి పిల్ల
నీ నడుము చక్కగుంటుందె | నాయుడో లమ్మీ ౹౹ఏ౹౹

స్త్రీ:-ఎప్పుపెట్టు కోవాలో | అప్పుడెట్టు కోవాలి
పండుగ పున్నానికి | సోకుదారి మగడ
అది అప్పుడెట్టు కోవాలి | నాయుడు బావ

తడిక పాటలోని చిన్న అలకవలె పెద్ద అలకలు కూడ నగతో పటాపంచలు !

105