పుట:Palle-Padaalu-1928.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజసపు కోడలు

——రాజసపు కోడలు వాలకము పరిశీలించండి.

ఇల్లలికి ముగ్గుపెట్టి రింటి మగవారు
పేడకళ్ళు దీయు పెదబావగారు
ఇంటి పనులు చేయు ఇంకో బావయ్య
అంటు లన్నియు దోము అత్తయ్యగారు
ఇంటి పనులు నయ్యె విడిది లేవమ్మ;

దుబ్బుఫుల్ల పది పంచటరు గేది ?
చిట్టిముంత నీళ్లేవి చిరుపను పేది ?
కుంకపు బరిణేది అద్దముఏది ?

చూడరా ఆడదాని సురటి మాటలు
చూడరా ఒక దెబ్బ చూడరా ఇకను ;
ఎక్కరా చింత చెట్టు విరవరా జూక
వెయ్యరా ఆజూక వెన్ను పొడుగునను;

ఆరు నెలల బాల చంక బెట్టుకుని
పుట్టింటికప్పుడు మరిదౌడుతీసి
అల్లంత దూరాన అన్నలుచూసి

101