పుట:Palle-Padaalu-1928.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆవులు గలవారి ఆడమనిషిని
కోడెలు గలవారి కోడల్ని నేను
మేకలు గలవారి 'మేన కోడల్ని
మాఅత్త కొట్తాది బిందెత్తి పొమ్ము
మీఅత్త కొట్ట నేల బిందెత్త నేల
అల్లదిగా మాఅత్త తానె వస్తున్నది
ఎత్తోద్దు ఎత్తోద్దు వెళ్ళండి బాబు

అత్త వచ్చినచో బిందె తనంతట తానే నెత్తి పైకి లేచును. బిందెకు కూడ అత్త గారన్న భయమే. నిండు బిందె నెత్తిపై మోయు అలవాటు పూర్వాంధ్ర సీమ పాటకపు జనములకు కలదు.

99