పుట:Palle-Padaalu-1928.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొబ్బియళ్లో

——ఇవి చూడండి. పల్లెటూరి నీలాటి రేవుకడ దృశ్యములు.

పెద్దది అక్కమ్మ పెడబానతోడ గొబ్బియళ్ళో గొబ్కీయళ్ళో
పెద్దది ఆక్కెమ్మ నీళ్లకుపోయె " "
ఎంతచక్కగా ఏడుమెట్లుదిగి? " "
గడగడన కడవకడిగి బుడబుడనముంచె " "
చుట్టూపక్కల చూచె ఎవ్వరు లేరు " "
కట్టపైన పోయేటి గింగుట్ల రాజు " "
కడవట్ల ఎత్తుదువూ రావయ్య రాజు " "
ఎత్తి తే ఎత్తెను పేరేమి చెప్పు " "
పేరేమిచెప్పేది పేదోళ్ల పాప " "
నాపేరువజ్రమే కడవ పేరు ముత్యమే " "

ఆక్కమ్మ అన్న చూట పెద్దపిల్ల అన్న అర్థముతో దేశసారస్వతములో కనబడుతుంది. అది సామాన్య నామ మన్నమాట.

97