పుట:Palle-Padaalu-1928.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎదురు చూచే వదిన

——బావమీద ఏడ్వడానికి చాలా వాక్కును బావ ఫలాని నాటికి వస్తానని చెప్పి 'దేశము? నకుపోయినాడు. గడువులు దాటినవి రాలేదు. ఆమె ఆందోళనమును గుర్తించండి.

ఏఒదినా ఏఒదినా ఎందు కేడుత్తాపు
ఎర్రినా ఒదినా నువ్వెంటనె సెప్పు
దేశ మెల్లిన మీకన్న తిరిగి రాలేదు
తిరుగొత్తె బాగున్ను తీర్త మెలుదూము
ఎల్లినో డెల్లినట్టె ఉండిపోతాడ
రేపోమాపోగాని తిరిగొత్తాడొదిన
సెప్పెల్లిన గడువూలు దాటిపోనాయి
సెట్టెక్కి సూడోలె వత్తున్న డేమొ
సెట్టొద్దు సే మొద్దు ఊరుకో ఒదిన
రాబోయె మాయన్న రాకమానడు
సూసీ సూసీ కళ్ళు కాసినై కాయాలు
మేసేటి ఆవూలు మానినై మేతాలు

కలత ఎక్కడికి పోగలదు ? ఆవులకు కూడా ప్రాకినది.

94