పుట:Palle-Padaalu-1928.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వదినె పాట

——మగవారి హాస్యాలు సున్నితంగా వుండక మోటుగా నుంటవి. గురజాడ వారుపలికే వరకూ తెలుగువారు హాయిగా చక్కగా వచ్చుటమే నేర్చుకోలేదు. మోటుహాస్యపు పాటలలో ఒకటి.

వదినెకు వగదర
బిందెకు బిగదర
బంగరు కుచ్చుల మావదినే
గోడపొంటి రెండునల్లులు పారుతె
ఉలవలంటదీ మావది నే
బుక్కు తనంటది మావది నే

నరాలపొంటి తేళ్ళు పారుతె
సేవాలంటది మావదినే
తింటనంటది మావదినే
దూలాలపొంటి పాములుపారుతె
కడియాలంటది మావదినే
పెట్టుకుంటనంటది మావదినే

శెక్కెరబుక్కి దొడ్లవంటే
చీమలుకుట్టిన మావదినే
అన్నంతినక అర్రలవంటే
అన్నయ్య కొట్టిందా వదినే

90