పుట:Palle-Padaalu-1928.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేలుకొలుపు,

——ఇది అత్తింటి ముద్దుకోడలికి మేలుకొలుపు. “లేవే సీతమ్మా మాయమ్మా ముద్దులగుమ్మా లేవే బంగరుబొమ్మ లేవే ఆదియే మే మాయమ్మ అదుపు లేదా నీకు అత్తవారిల్లిది లేవే”

అన్న మేలుకొలుపు గుర్తుకు వస్తుంది ఇదివింటే.

జాజిపూల జలకమాడి
పాల పెల్లి పాల కెక్కి
అత్త యింట నడుగుపెట్టి
మొగుడురాగ మొగముదాచి
ఎందుకింత సిగ్గుపడుదు
వేలనీకు యింతసిగ్గు?
తాడిచెట్టు తలచుదన్ని
తాతనీడ తరిగిపోయె
నిదుర లెమ్ము నిమ్మకాయ
కళ్ళు విప్పు కందపిలక
త్వరగ లెమ్ము తల్లిగాదె
చిలుకవచ్చి చెటుమీద
పిలుచుచుండె పిల్ల నిన్ను
వేగ లెమ్ము వెన్నయిదిగో
కిత కిత కిత కిత కిత కిత

89