పుట:PadabhamdhaParijathamu.djvu/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్ప_____అప్పీ 72 అప్పు_____అప్పు

అప్పసంలో పెల్ల వేసినట్లు

  • బురద కాలువలో మట్టిపెళ్ళ వేసినట్లు.
  • చెడ్డవాని నోటికి పోయి తిట్లు తెచ్చుకొనే సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.

అప్పా:

  • ఆశ్చ ర్యార్థకము.
  • "అప్పా యప్పురి జెప్ప నొప్పుదురు రూపాజీవికారత్నముల్." రా. వి. 1. 58.

అప్పాట.

  • ఆవిధంగా - ఆసమయంలో, ఆపాట్న అనే రూపంలో రాయలసీమలో వినబడుతుంది.
  • "పాక దశ బొందు సెప్పు డప్పాట గాని." భీమ. 3. 72.

అప్పా నాయనా అను

  • ఎదుటివానిని గౌరవముతో చూచు.
  • "ఎవరువచ్చినా అప్పా నాయనా అని ఎంతో ఆదరిస్తాడతను." వా.

అప్పీలు లేదు

  • తిరుగు లేదు.
  • ఇది కోర్టువ్యవహారాలద్వారా వచ్చినపలుకుబడి.
  • అపీ లున్న దనగా దానిపై తిరిగి విచారించి తప్పో ఒప్పో నిర్ణయించే అధికారం మరొకరి కుంటుం దనుట, అది లేదంటే వాడిదే తుదిమాట.
  • "వాడిమాట కిక అప్పీలు లేదు." వా.

అప్పు చేసి పప్పుకూడు తిను

  • ఏవిధంగా చేసి అయినా సుఖ మనుభవించు.
  • తగనిపని చేసి భోగ మనుభ వించు.
  • పప్పుకూడు భోగ సూచకము.
  • "వాడి కేం? ఎప్పుడూ సుఖమే. అప్పుచేసి పప్పుకూడు తినేరకం." వా.

అప్పుపుట్టు

  • అప్పు దొరకు.
  • "ఆ ఊళ్లో గింజుకొన్నా అప్పు పుట్టదు." వా.
  • దీనినే పరపతికల్గు అనే అర్థంలో కూడా ఉపయోగిస్తారు.
  • "వాడికి ఎక్కడా దమ్మిడీ అప్పు పుట్టదు." వా.
  • అనగా పరపతి లేనివా డనుట.

అప్పు పెట్టు

  • అప్పిచ్చు.
  • "నాలుగు రూపాయలు అప్పు పెట్ట వోయ్. తర్వాత ఇస్తాను." వా.

అప్పులగంప

  • అప్పులమయము.
  • భద్రగిరి. 71.

అప్పులపా లగు

  • ఋణగ్రస్తు డగు.
  • "ఎంద అప్పులపా లగు టెఱుగ బడదు." శ్రవ. 2. 60.

అప్పుల ముంచు

  • అప్పులపాలు చేయు.
  • యామున. 4. 42.