పుట:PadabhamdhaParijathamu.djvu/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అప్ప_____అప్ప 71 అప్ప_____అప్ప

అప్పగింత పాటలు

 • నూతనవధువును అ త్తవారింటికి పంపునప్పుడు పాడే పాటలు.

అప్పగింత పెట్టు

 • 1. నూతనవధువును అ త్తవారి కప్పగించు.
 • 2. చిన్న పిల్ల లను మరొకరికి అప్పగించు.

అప్పగింతలు

 • 1. నూతన వధువును అత్తవా రింటి కంపుట.
 • 2. ఇంటి యజమాని చనిపోతూ చిన్న పిల్ల లను మరొకరికి అప్పగించుట.

అప్పటి కప్పటికి

 • అప్పుడప్పుడు, తఱుచు.
 • "...తప్ప కత డమరమౌనియ, యప్పటి కప్పటికి వచ్చు యదుపతికడకున్."
 • కళా. 1. 172.
 • "అప్పటప్పట వాడు మా యింటికి రావడం కద్దు." వా.

అప్పడములుగా నమలు

 • అవలీలగా నమలు.
 • నారా. రుక్మిణీకల్యాణము.

అప్పనగొను

 • పైవా రాదరపూర్వకముగా నిచ్చుదానిని స్వీకరించు. అప్పనపెట్టు అన్నది వైష్ణవ పరిభాషగా వినబడుతుంది.
 • దేవాలయాదులలో ప్రసాదాన్ని భక్తులు అప్పన పెట్టమంటారు. దీనిమీద మరింత సాగి, అప్పనము-ఊరక వచ్చినది అన్న అర్థాలలో కొన్ని ప్రాంతాలలో 'ఇదేమి అప్పనంగా వచ్చిందా' అని వాడుకలో వినబడుతుంది.
 • ఇదే అర్థంలో 'ఉద్ద రకు వచ్చిందా' అని రాయలసీమలో అంటారు.
 • "....గణనాథున కీవచ్చు గదా యని కోమటి కొమిరె వాని యప్పన గొనుచుం." శు.క. 2 ఆ. 216 ప.

అప్పన పంపు

 • కానుక లిచ్చు.
 • "వలసలు పోవు వారు, దగు వస్తువు లప్పన పంపువారు గే, వలవినయంబుతో గొలుచు వారును నైరి."
 • కళా. 8. 45.

అప్పప్ప

 • ఆశ్చర్యార్థకము.
 • "అప్పప్ప భవత్ప్రభావవిభ వాఢ్యత." సారం. 1. 31.

అప్పలప్ప లను

 • పిల్ల లను దగ్గరకు పిలుచుటలోని అనుకరణము.
 • "అప్పలప్ప లనినంత గద్దించి యశోద మేను కౌగలించుశిశువు."
 • తాళ్ళ. సం. 4. 1.

అప్పవిందులయాట

 • ఒక బాలక్రీడ.
 • పండితా. ప్రథ. పురా. పుట. 460.