పుట:PadabhamdhaParijathamu.djvu/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అన_____అన 63 అనా______అని

అనబట్టు

 • అనుటకు తగు, అనవలసి వచ్చు, రాయలసీమలో వాడుకలో ఉంది.
 • "ఇట్లా అని అనబట్టదు వాడి సంగతి."
 • "ఇట్లా చేస్తా వుంటే ఏదో గట్టిగా అన బట్టుతుంది." వా.

అనరాదు గాక

 • అనగూడదు గానీ.
 • "అనరాదు గాక నా యింటన కా దిటు వంటి చెలువ నాకంబున గల్గునె." కళా. 5. 117.
 • "అనగూడదు గానీ వా డంత నీచుడు మరొకడు ఉండడు." వా.
 • "నాకొడుకు కనక అనరాదు గానీ వాడు మంచి దిట్ట మైనపండితుడు." వా.

అనలు కొనలు పాఱు

 • తీగ సాగు, వృద్ధి చెందు, తీగ పెరిగేటప్పుడు ననలు వేస్తూ పెరగడం ద్వారా వచ్చినపలుకుబడి.
 • "అనలుం గొనలుం బాఱుచు, మనమున నా కోర్కెతీగె మగువకు మిగులం." కళా. 6. 212.
 • "కుటిలాలక కూర్మి యనలు గొనలుం బారన్." సారం. 3. 144.
 • "అమరగ లతికలు...గుము రై, యెల దోట యనలు గొనలుం బాఱెన్." విప్ర. 2. 24.
 • చూ. తీగ సాగు.

అనవలసి యంటి

 • మాటసామెతగా చెప్పితినే కానీ మ రేమీ కాదు అన్న సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.
 • "అనవలసి యంటి నిన్నుం, గను గొనుటే చాలు బడలికలు కనుపించెన్." శుక. 2 ఆ. 523.

అనాగతవిధాత

 • రాబోవు కీడును ముందే గ్రహించి దానికై జాగ్రత్త పడువాడు.
 • పంచతంత్రములోని మూడు చేపలకథపై వచ్చినపలుకుబడి. భారతంలోనూ ఉన్నది.

అనాఘ్రాతపుష్పము

 • వాసన చూడనిపూవు, అనను భూతపూర్వము.
 • పాండు. 5. 186.

అనిగొను

 • యుద్ధము చేయు.
 • యామున. 1. 221.

అనిచి పుచ్చు

 • పనిమీద పంపు.
 • "నన్నుం దగవుగ భూవిభుకడ కనిచి పుచ్చు." భాస్క. అర. 2. 176.

అనియు ననక మునుపే

 • వెంటనే అనుటి.
 • నోటిమాట నోటిలో ఉండగానే, అనీ అనక ముందే, వచ్చీ రాక ముందే, చేసీ చేయక ముందే, చెప్పీ చెప్పక ముందే-ఇలాంటివి పెక్కులు.
 • "అని యనియు ననక మునుపే యనఘా!..." శుక. 2 ఆ. 165. ప.