పుట:PadabhamdhaParijathamu.djvu/873

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జుబు - జుఱ్ఱు 847 జులు - జూద

తేనెటీగలు లేచినట్లుగా అనుట. జుమ్మని గుంపులు గుంపులుగా బయలు వెడలుపట్ల ఉపయోగించే సామ్యం.

 • "జున్ను రేచినరీతి సుర లెల్ల బెదరి, కన్నవా రేఁగిరి కన్న త్రోవలకు." గౌర. హరి. ప్ర. 319-320.

జుబురుకొను

 • గుబురుకొను, గుంపు గట్టు.
 • రూ. జుజురుకొను.

జుమ్మికాడు

 • విటుడు.
 • రూ. జుమ్మ కాడు.

జుఱ్ఱుపదనుగా

 • జుఱ్ఱుకొనుటకు వీ లగునట్లు ద్రవముగా.
 • "పరిపాటి మై జుఱ్ఱుపదను వండి." హర. 2. 121.

జుఱ్ఱు పదను చేయు

 • జుఱ్ఱుటకు వీ లగునట్లు ద్రవభూతముగా చేయు.
 • "చంద్రకాంతపు నీట జాలైన వెన్నెల, ముదురు వెన్నెల జుఱ్ఱు పదను చేసి." పారి. 2. 49.

జుఱ్ఱుకొను

 • జుఱ్ఱున త్రావు, చేతితో జుఱ్ఱుకొను.

జుఱ్ఱున గ్రోలు.

 • ధ్వన్యనుకరణము.
 • "పెక్కు వాసనల సొంపున నింపు జనింప జుఱ్ఱునన్, గ్రుక్కెఁడు గ్రుక్కెఁడే మధువు." కళా. 6. 128.

జులుము చేయు

 • అధికారము చేయు, పెత్తనము చేయు.

జూటకాడు

 • నేర్పరి.
 • "పందె మాడినభంగిఁ బందుల నొప్పించ, జూటకాం డ్రగునట్టివేటకాండ్రు." ద్వాద. 8. 22.

జూటాడు

 • మోసగించు. రా. వి. 3. 52.

జూటామాట

 • అబద్ధము.
 • "...జూటామాట లనుచు నెంచితిరి గదా!" శ్రవ. 2. 49.

జూటుకత్తె

 • వంచకురాలు, అబద్ధీకురాలు.

జూటుడు

 • అసత్యవాది. వేంకటేశ. 9.

జూదకత్తె

 • వంచకురాలు, జూద మాడునది.

జూదకాడు

 • జూదరి.

జూదరికత్తియ

 • జూద మాడునది.