పుట:PadabhamdhaParijathamu.djvu/871

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవ - జీవి 845 జీవి - జుట్ట

జీవనాధారము

 • బ్రదుకుదెరువు, జీవనోపాయము.

జీవన్ముక్తుడు

 • బ్రతికి యుండగనే ముక్తిని చెందినవాడు.

జీవన్మృతుడు

 • బ్రతికిఉన్నా చచ్చినవాని వంటి వాడు.

జీవమాతృక

 • సప్తమాతృకలలో ఒకతె.

జీవము వచ్చు

 • ప్రాణము లేచి వచ్చు.
 • "సమ్మతిఁ బ్రోవ నిందు, వచ్చితి గాన జీవము వచ్చె నాకు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 2835-36.

జీవశ్రాద్ధము

 • ఘటశ్రాద్ధము. కాళ. శత. 34.

జీవితము ఏమిగా చేసి పోయెదవు?

 • నా బ్రదుకు ఏం చేస్తావు? ఎవరినో పూర్తిగా నమ్మినపుడు అతడు దిగనాడగా అనుమాట.
 • "నా జీవితంబు, నేమిగాఁ జేసి పోయెద వెఱుఁగఁ జెపుమ." కళా. 3. 59.

జీవితములు సేయు

 • పని కల్పించు, జీతమునకు పెట్టుకొని వారికి జీవనం ఏర్పఱచు.
 • "తాఁ గాక మఱియు మేదరులు గొందఱకు, జీవితంబులు సేసి చేటలు సాలఁ, గావించి బండ్లను గడపి యూరూర, నమ్మించి." పండితా. ప్రథ. పురా. పు. 476.

జీవితములో నిప్పులు పోయు

 • బ్రతుకు పాడు చేయు.
 • "ఏమీ ఎరగని ఆ పిల్లను చెఱచి దాని జీవితంలో నిప్పులు పోశాడు వెధవ." వా.

జుంజుఱుకట్ట

 • వెలుతురుపుల్లలు వగైరాతో చేసిన దివిటీ. శ. ర.

జుంజుఱుపిశాచము

 • కొఱవిదయ్యము. చంద్రా. 6. 98.

జుంటితేనె

 • జుంటీగలు కూర్చిన తేనె.

జుంటిమోవి

 • జుంటి తేనెవంటి మధుర మైన ఓష్ఠం.

జుంటీగ

 • తేనెటీగ.

జుజురుకొను

 • దట్ట మగు.
 • "జుజురుకొన్న తనూరుహస్తోమములను." కాశీ. 6. 41.

జుట్టనవ్రేల జూపు

 • వేలెత్తి చూపు. తప్పు పట్టు.
 • "నరునకు నిన్ను జుట్టనవ్రేలనుం జూపవచ్చునే." భార. ద్రోణ. 2. 304.