పుట:PadabhamdhaParijathamu.djvu/870

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీని - జీలు 844 జీవ - జీవ

జీనిసరిపెణ

 • ఒకరక మైన మెడలోని గొలుసు.

జీనిసరులు

 • ధాన్యవిశేషం.

జీనువముక్కులు

 • ధాన్యవిశేషం.

జీబుకొను

 • దట్ట మగు.

జీరగుండులు

 • మేల్కట్టున వ్రేలునట్లు కట్టే రసగుండ్లు.

జీరాడు

 • వ్రేలాడు.

జీరుకాడు

 • చూ. జీరాడు.

జీరుకుపాటు

 • తొట్రుపాటు.

జీరుకురాయి

 • జీరుకుబండ.

జీరులాడు

 • చూ. జీరాడు.

జీరువాఱు

 • జీరాడు.

జీఱుకువాఱు

 • జీఱు.

జీలుగు పెరిగిన మాలెకు కంబము గాదు

 • బలహీన మైనది ఒక పెద్దరక బలమైనపనికి పనికి రాదు. జీలుగు వట్టి బెండు. అది యెంతగా పెరిగినా యింటికి పెట్టుకొనుటకు స్తంభముగా పనికి రాదు.
 • "ప్రేలకు జీలుగు వెరిగిన, మాలెకుఁ గంబంబు గాదు." ఉ. హరి. 3. 50.
 • "జీలువు పెరిగిన మాలెకంబము గాదు, గొడ్డుఁ బెంచిన జాతిగోవు కాదు." నీతి. 70.

జీవగఱ్ఱ

 • 1. ప్రాణాధారము.
 • "వలిమల యల్లువాఁడు తలవాఁక ధరించిన పూవుగుత్తి వే,ల్పుల గమి జీవగఱ్ఱ." పారి. 1. 6.
 • "శ్రేయోవధూటికి జీవగఱ్ఱ." విప్ర.1. 84.
 • 2. శ్రుతిని హెచ్చించుటకో తగ్గించుటకో ఉపయోగించే వీణెపై నున్న కఱ్ఱబిరడా.
 • "శ్రుతికి నుత్కర్షంబుఁ జూపంగ వలయుచోఁ, జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ." క్రీడా. 1. 36.

జీవచ్ఛవముగా

 • బ్రతికి చచ్చినవానితో సమానముగా.

జీవనము పడగొట్టు

 • బ్రతుకుతెరువు చెడగొట్టు.
 • "నా జీవనం పడగొట్టితే నీ కేం వస్తుంది?" వా.