పుట:PadabhamdhaParijathamu.djvu/865

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాలి - జాలి 839 జాలి - జావ

  • "అదా అమ్మా ! జాలిక లేకనే బంగర మాడుతుంది." వా.

జాలిగుండె

  • దయాళువు.

జాలి గుడుచు

  • దు:ఖపడు.

జాలిగొను

  • విచారపడు, భయపడు.

జాలిపడు

  • దు:ఖపడు, కష్టపడు. ఇందుకు దగ్గఱి భావచ్ఛాయలలో... నేటి వాడుకలో కృప సూపు అన్నట్లు వినవస్తుంది.
  • "వాణ్ణి జాలి దలచినవాడు పాపాత్ముడు." వా.

జాలిపెట్టు

  • 1. బాధించు. భీమ. 4. 112.
  • 2. సొదపెట్టు.
  • "పెక్కుమాటల నిఁక జాలిపెట్ట నేల?" కాశీ. 2. 88.

జాలి పొందు

  • భయభ్రాంత మగు.
  • "గోలాంగూలకులంబు లాకులపడెన్ ఘోషించె శార్దూలముల్, జాలిం బొందె లులాయముల్/" హర. 6. 46.

జాలి మాలి

  • కోరిక బల మై ఉఱ్ఱట లూగుట. దీనినే వాడుకలో ఆలీ జాలీ యెత్తు, ఆలీ జాలీ పడుతున్నాడు అంటారు.
  • "మనసిజవేదనల జాలి మాలి తిరుగఁ గాన్." హంస. 4. 45.
  • "ము,వ్వంపుల కైదువుం దిగిచి వంపుచు దావుల యంపసోన వ,ర్షింపుచు జాలి మాలి గొనఁ జేసె మరుం డమరీకదంబమున్." కవిరా. 3. 45.

జాలి వొందు

  • జాలిపడు.
  • "అని జాలి వొంది రయముతో వచ్చు, జనకజాభర్త...!" వర. రా. అర. పు. 210. పంక్తి. 3.

జాలుకొను

  • 1. ప్రవహించు, స్రవించు.
  • 2. వర్ధిల్లు.
  • 3. ప్రసరించు.

జాలువాఱు

  • చూ. జాలుకొను.

జా లెత్తు

  • స్రవించు.
  • "జల జల జా లెత్తెఁ జంద్రకాంతములు." వర. రా. సుం. పు. 18. పంక్తి. 12.
  • "జా లెత్తె నౌర! ...లోచనాంచలమ చెలమ." విజయ. 3. 11.

జాలెత్రాడు

  • ఒక జెట్టి సాధనం

జావ కారి పోవు

  • భయపడి పోవు, నిర్వీర్యుడగు.