పుట:PadabhamdhaParijathamu.djvu/864

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాప - జాఱి 838 జాఱు - జాలి

జాపత్తిరి

  • జాతిపత్త్రి.

జా పరమేశ్వరా అను

  • పాఱిపోవు.
  • జానపదకథలలో ఎవ రైనా పోవునప్పుడు 'జా పరమేశ్వరా' అనడం వినవస్తుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "జా పరమేశ్వరా యనిన జంతువులన్నియుఁ బోయె మాయ మై." వరా. 1. 148.

జాబు జవాబు

  • ఉత్తరాలు. జం.

జాము వేగు

  • బ్రతుకు గడచు.
  • "చట్టు కూఁతురు గలుగ నీ జాము వేఁగె." నిరంకు. 3. 30.
  • వాడుకలో -
  • "అలాంటి భార్య ఉండబట్టి నీవు గడుపుకొస్తున్నావు గానీ లేకపోతే యీపాటికి ఏమై పోయేవాడివో?" వా.

జారీచెంబు

  • ప్రయాణాదులలో ఉపయోగించే ఒకవిధ మైన చెంబు.

జాఱ విడుచు

  • విడిచి వేయు.
  • "సత్కలాపంబులు జాఱ విడిచె." శివ. 2. 102.

జాఱిపోవు

  • పోవు, చ్యుత మగు.

జాఱుకొప్పు

  • కొనముడి.

జాఱుపైట

  • జాఱుచుండునట్టు వేసుకొను పైట.

జాఱుముడి

  • దువ్వుముడి.

జాఱువాఱు

  • చ్యుత మగు, తొలగు.

జాఱువోవు

  • తొలగు.

జాలకఱ్ఱ

  • నల్లఱాతియందు బెజ్జము లేర్పఱచిన కిటికీ. శ. ర.
  • వెలుతురు ప్రసరించుటకు రాతిలో చేసిన బెజ్జము. బ్రౌన్.
  • నిలువుగా కఱ్ఱను నాటిన కిటికీ. వావిళ్ల ని.

జాలవల్లిక

  • తాంబూలం తట్ట - అందుపై నగిషీ చేసి ఉంటారు.

జాలవాడు

  • ఈటెకాడు. బ్రౌన్.

జాలిక లేకనే బంగర మాడు

  • అతి సాహసి, నేర్పరి, జాణ అని నిరసనగా అనుటలో -