పుట:PadabhamdhaParijathamu.djvu/857

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జల - జల 831 జల - జల

జలకమువాడు

  • స్నానము చేయించేవాడు. ద్వి. పరమ. 3. 203.

జలకము గావించు

  • అభిషేకము చేయించు, స్నాన మాడించు.
  • "గంధోదకములను మఱి జలకంబు గావించి." పండితా. ద్వితీ. పర్వ. పుట. 468.

జలక మార్చు

  • స్నానము చేయించు. పాండు. 2. 17.
  • "మదవతీ కరముక్తమణికుంభసంభృత, సౌరభోదకముల జలక మార్చి." పారి. 5. 70.

జల గడిగినట్లు

  • బాగా కడిగినట్లు అనుట.
  • జల గడుగుట అనగా - బంగారంపై పోగర పనీ, ఆకురాతి పనీ చేసినప్పుడు వారు పెట్టుకొన్న చర్మంమీదనే కాక అటూ యిటూ ఏ కొంతో రాలిపడే అవకాశం ఉంటుంది. అందుకని ఆ తావులో కసపూడ్చి ఆ కసపు నంతటినీ ఒక చోట ఉంచి పెడతారు. దానిని జలగడుగు వాళ్లు, కాలువకో బావికో తీసుకొని వెళ్లి, నీళ్లు పోసి కడిగి, కడిగి పైన ఉన్న కసవు నంతటినీ తొలగించి వేసి, ఆ అడుగున తేలినదానిలో పాదరసం వేసి పట్టి పుఠం పెడతారు. అప్పుడు బంగారం తేలుతుంది. కాబట్టే జల గడుగుట అనగా బాగా కడుగుటగా అలవా టయినది.
  • "వాడి పుట్టు పూర్వోత్తరా లన్నీ ఏకరువు పెట్టి జల గడిగినట్లు వాడి మానం కడిగి వేశాడు." వా.

జలగడుగు

  • నీళ్ళతో కడుగు.
  • "అలివున సంపాదించితి, జలగడిగితిఁ బున్నె మెల్ల శాంతిపర! ననున్." కవిమాయ. అం. 4. 77.
  • చూ. జలగడిగినట్లు.
  • రూ. జల్లగడుగు.

జల గడుగువాడు

  • పైరీతిగా బంగారుపొడి కలిసిన కసవును కడిగేవాడు.
  • చూ. జల గడిగినట్లు.

జలజల రాలు

  • ధ్వన్యనుకరణము.
  • "జలజల రాలెఁ బూలు సుమసాయక సంగరకౌశలంబునన్." రాజగో. 4. 47.

జలతరంగములు

  • అశాశ్వతములు, క్షణికములు. పండితా. ద్వితీ. పర్వ. పుట. 418.
  • చూ. జలబుద్బదములు.

జలతైలబిందు వగు

  • నీటిలో వేసిన నూనెబొట్టు