పుట:PadabhamdhaParijathamu.djvu/850

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జడ - జడ 824 జడ - జడి

జడ చిక్కు దయ్యముచందము

  • బంధిత మై ఎటూ వెళ్ల లే నట్లు.
  • దయ్యాన్ని మంత్రగాళ్లు తల మీద కొద్దిగా వెండ్రుకలు తీసి, జడ వేసి, అందులోనికి దయ్యాన్ని ఆవహింపజేసి జడ కత్తిరించి వేస్తారు. అందులో తగులుకొన్న దయ్యము దిగ్బంధనం చేసి ఉంటారు కనుక ఎటూ పోలేక గిలగిల లాడుతుందట. దీనిపై వచ్చిన పలుకుబడి.
  • "జడ చిక్కుదయ్యంబు చందమునను." హంస. 1. 220.
  • "ఇపు డేఁగి యమరనాథుఁడు మెచ్చన్, జడ లొడిసి పట్టి తెత్తునె, జడఁ జిక్కిన దయ్యమట్లఁ జనుదేరంగన్." చంద్రా. 8. 40.

జడతల

  • వెండ్రుకలు ఒత్తుగా ఉన్న తల.
  • "ఆ పిల్లది మంచి జడతల. ఏం చేసుకున్నా అందంగానే ఉంటుంది." వా.

జడను పడు

  • 1. మ్రాన్పడు.
  • "ఆ జననాథుఁడు శోక మంది జడను పడియు." భాస్క. అయో. 183.
  • 2. అలస మగు.
  • "నడ జడను పడియె నా రే,ర్పడియెన్ జనుమొనలు నల్ల వడియెన్." మను. 3. 119.

జడప్రత్తి

  • జడలు జడలుగా గింజ లుండే పత్తి.

జడబిల్ల

  • జడలో పెట్టుకునే బిళ్ళ - ఒక నగ.

జడముడి

  • ఈశ్వరుని జటాజూటం - కపర్దం.

జడలు గట్టుట

  • మునివృత్తి నవలంబించుట.
  • "జడలు గట్టుట వృథా శ్రాంతి యాతనికి." గౌ. హరి. ప్రథ. పంక్తి. 565.

జడిగాడ్పు

  • ప్రచండవాయువు. బ్రౌన్.

జడి గురియు

  • ఎక్కువగా కురియు.
  • "ఆనందబాష్పములు జడి గురియన్." భాగ. స్క. 3. 394.

జడి గొను

  • నిరంతరముగా కురియు. లక్షణయా వ్యాపించు.
  • "ఒడి దారముల కాంతి జడిగొనంగ." నిరంకు. 4. 89.
  • ఇది విశేషంగా అన్నట్లు 'జడిగొన్ కోర్కులు' ఇత్యాదులలో విధవిధాలుగా ఉపయుక్త మవుతుంది.