పుట:PadabhamdhaParijathamu.djvu/844

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చోఱ - చౌక 818 చౌక - చౌద

చోఱవాడు

  • బాలసేవకుడు.

చోళము విఱుచు తెఱగున

  • జొన్నలను పేలాలుగా వేచినట్లు.
  • "పాదరసంబు మర్దించుపంతంబునఁ జోళంబు విఱుచు తెఱంగున." ఉ. హరి. 3. 71.

చోళవాళిక కాక వేళవాళికి కర్తవే?

  • జీతమునకే కాని, కాలమునకు నీవు కర్తవా?
  • జొన్నలకూలికే కాని జీవిత విధానమునకు నీవు కర్తవా ? అని ప్రభాకరశాస్త్రిగారు. నిశ్చితంగా తేల లేదు.
  • "చోళవాళికె కాక క్షోణితలేశ, వేళ వాళికిఁ గర్తవే?" పండితా. ద్వితీ. మహి. పుట. 184.

చౌక అగు

  • చులుక నగు.
  • "కారు కాలానఁ గలిగిన గౌరవంబు, చౌక యై తోఁచె శరదృతుసౌష్ఠవమున." పాండు. 4. 42.
  • వాడుకలో - తక్కువవెల అనే అర్థంలో పరిపాటి.
  • "వంకాయలు ఈ కాలంలో బాగా చౌక అయినవి." వా.

చౌక చేయు

  • చులుకన చేయు
  • "సాహిత్యమార్గంబు చౌకఁ జేసినవాఁడు." నిరంకు. 2. 34.
  • "న న్నిటు చౌక సేసినను నాతిరొ! యేగతి నోర్వ వచ్చునే?" రాజగో. 3. 9.

చౌకపడు

  • చౌక అగు. మత్స్య. 1. 151.

చౌకపఱచు '*చౌక చేయు. చౌక సేయు

  • చూ. చౌక చేయు.

చౌకాడిగుదియ

  • నాలుగుప్రక్కలు తీర్చిన ఇనుపదండము.

చౌకాలిపీట

  • నాలుగుకాళ్ళ పీట.

చౌటిపడియలు

  • చౌటినేలలోని చెలమలు. నీటికుండములు.
  • "ఇందుల చౌటిపడియ లూహింప, నిరతంబు క్షీరాంబునిధి పుట్టినిండ్లు." పండితా. ద్వితీ. పర్వ. పుట. 241. బస. 7. 181.

చౌటుప్పు

  • చౌటి నేలలో తేలేఉప్పు.

చౌడోలి

  • అంబారి.
  • రూ. చౌడోలి; చౌడోలు.

చౌదరితనము

  • గొప్పతనము. శుక. 2. 414.