పుట:PadabhamdhaParijathamu.djvu/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద_____అద 57 అద______అది

  • "కెడసిన గరిసెలక్రింద లాగల గ్రుస్సి యదవకాపుర ముండు నాఖుతతుల." ఆము. 6. 13.
  • చూ. అదవత్రావుడు.

అదవచిక్కు

  • అధీనములో నుండి లోకువ యగు.
  • "నీకు నే నేం అదవ చిక్కి నా ననా? అన్నిమాట లంటున్నావు?" వా.
  • "వాడు అదవ చిక్కినవాడు కనుక నువ్వేం చేసినా చెల్లుతూ ఉంది. ఇం కెవడైనా అయితే ఓర్చుకుంటాడూ?" వా.

అదవత్రావుడు

  • తిరిపెపుత్రాగుడు.
  • ఒకరు త్రాగుతూ - వీడు ఎదురుగా ఉంటే పోనీ వాడికీ ఒక ముంత ఇవ్వు అని - యిప్పించునది. అదవ అంటే లోకువ, క్రిందివాడు అనే అర్థాలలో అనేక ప్రయోగాలు కాన వస్తాయి. అదవనాయాలా ఒక తిట్టు.
  • "తన చెలులిండ్లయం దదవత్రావుడు త్రావుచు..." పాండు. 3 ఆ. 19 ప.

అదవదపడు

  • వ్యథపడు.
  • "భేతాళు బురికొల్పి పృథివీశు నసిధార, సాతండు దెగి కూల నదవదపడి."
  • రామకథా. బాల. 7. 476.

అదవద పొందు

  • కలతచెందు.
  • "అదవద బొంద బా లయితి నక్కట!" హరి. ఉ. 8. 199.

అదవద లగు

  • చెల్లా చెదరు లగు, కలత చెందు.
  • "అదవద లైన పయ్యెదలు నందము తప్పిన హారవల్లులున్." విక్ర. 5 ఆ.

అదవనాయాలు

  • ఒక తిట్టు.
  • "పోరా అదవనాయాలా. నీతో నేం నాకు?" వా.
  • చూ. అదవ.

అదవబతుకు

  • నీచపుబతుకు.
  • "నాది వట్టి అదవబతుకు అయిపోయింది." వా.

అదవెట్టు.

  • మొఱపెట్టు.
  • "అని యిట్లు ధరణీసురుం డదవెట్ట భాగవతక్షోభమునకు భువనభర్తయు భయంపడి." ఆము. 7. 48.

అదాట్టుగా

  • హఠాత్తుగా.
  • "వాడు అదాట్టుగా వచ్చి పట్టు కొన్నాడు." వా.

అది ఒకటే కొదవ

  • కావలసి నన్నీ అయినవి, అదొక్కటే తక్కువ అనుట.
  • "ప్రజలయిండ్ల గన్న పెట్టని దొక్కటే కాని కొదవ, కడకు దుర్వృత్తులన్నియు గఱచె నతడు."
  • నిరంకు. 2. 26.