పుట:PadabhamdhaParijathamu.djvu/816

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేకొ - చేగొ 790 చేగో - చేజే

చేకొను

  • దగ్గర తీయు; తీసుకొను.
  • "మానము దూలినవాని...జేకొండ్రె." భాస్క. యుద్ధ. 1243.
  • ఇతర భావచ్ఛాయ లనేకం దీని ననుసరించే కానవస్తాయి.

చేకోల

  • చేతికఱ్ఱ.

చేకోలు

  • చేకొనుట.

చేగగడ్డ

  • ఒక ఓషది. బ్రౌన్.

చేగడియ

  • వాకిలి కున్న గడియ. చేతితో తీయగలది - చిన్నది. శుక. 2. 127.

చేగ దేరు

  • చేవ దేఱు; గడిదేరు.
  • "చేగదేరి వారలు సేసినదే చేఁత." తాళ్ల. సం. 8. 118.

చేగానుగ

  • చేతితో త్రిప్పేగానుగ. హర. 1. 18.

చేగిండి

  • చేతితో పట్టుకొనగల గిండి - కూజాచెంబు. దశా. 4. 97.

చేగొడ్డలి

  • గండ్రగొడ్డలి, చిన్నగొడ్డలి. భాగ. 9. 467.

చేగోడీలు

  • ఒక తినుబండం. కోడివడలు, కోడిమెడలు అని దక్షిణాంధ్రం వాడుక.

చే చమురు

  • నెయ్యి - చేతిలో వేసు కుంటారు గనుక.

చే చాచు

  • ఆశించు, సిద్ధపడు.
  • "ఎవ్వారికిం, జేరన్ రానిమహానిధానమునకుం జే చాచితిం దొయ్యలీ!" ఉత్త. హరి. 5. 155.
  • "ఎవ్వనితో నిచ్చోటం, జివ్వకుఁ జే సాఁప వలదు." కాశీ. 1. 109.
  • పరమ. 3. 157. పుట.

చేచేత కుడిపించు

  • స్వయముగా అనుభవింప జేయు.
  • "చేసినకార్యంబు చేచేతఁ గుడిపించె." శశి (అప్ప) 467.

చేచేపు

  • చేపు.
  • "పాలిండ్లు చేచేప, మదిఁ బుత్రుపైఁ బ్రేమ మల్లడి గొనఁగ."

చేజిక్కు

  • వశ మగు. రాధ. 2. 105.

చేజేతుల చేసికొను

  • స్వయంగా చేసుకొను.
  • "ఆ వ్యాపారంలో దిగి పాడై పోయావు. చేజేతులా చేసుకొన్నదానికి ఒకరిని అని లాభం యే ముంది?" వా.