పుట:PadabhamdhaParijathamu.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అత్త_____అత్తా 55 అత్తి_____అద

అత్తముండ

  • నిరసనగా అనునప్పుడు అత్తను గూర్చి అనుమాట.
  • "ఉత్తముండకంటే అత్తముండ మేలు." సా.

అత్తమీద కన్నులు అంగడిపై చేతులు

  • "నందసుతుడు మున్ను నామీది ప్రేమచే, నొకటి సేయ బోయి యొకటి సేయు, అత్తమీద గన్ను లంగటిపై జేఉ, లాయె ననుచు జెలియ లరసి నవ్వ."
  • రాధి. 3 అ.

అత్తలాగ

  • అత్తవలె పోరు ననుట.*
  • "అత్త లేకపోతే నేం. మా ఆయన ఉన్నాడుగా. ఆయనే నా కత్తగారు."
  • "ఆ మేనేజరు అత్తలాగ అస్తమానం పోరుతుంటా డంటే నమ్ము." వా.

అత్త లేనికోడలు ఉత్తమురాలు

  • దండించువా రెవరూ లేరు. కనుకనే ఆమె తప్పులు బయటపడ వనుట.
  • "అత్తలేని కోడ లుత్తమ్మురాలు." పా. పా.

అత్తా లేదు ఆడబిడ్డా లేదు

  • దండించువారు, తప్పు పట్టువారు ఎవరూ లే రనుట.
  • "అత్తా లేదు. ఆడబిడ్డా లేదు. దానికేం? ఏ మయినా చేస్తుంది." వా.

అత్తారబత్తంగా

  • ముడుపులాగా.
  • క్రొత్త. 29.

అత్తింటికాపురం

  • పరతంత్రజీవనం.
  • "అక్కడ పని చేయడం అత్తింటి కాపురంగా ఉంది. ఏం చేసినా తప్పే. ఏం చేయ కున్నా తప్పే." వా.

అత్తింటికుంది

  • ద్వేషముతో చూడబడునది.

అత్తింటికోడలు

  • మగనాలు.
  • "అత్తింటికోడలికి గా, హత్తుక నత డుండె నొక యువాగ్రణికొఱకై."
  • హంస. 2. ఆ. 246 ప.

అత్తిల్లు చేరి బ్రతుకు

  • నీచముగా జీవించు.
  • కృష్ణనీ. 76.

అత్తెసరు పెట్టు

  • సరియెసురు పెట్టు.
  • బియ్యానికి పైన చేతివ్రేళ్లు మునిగేదాకా నీ ళ్లుండునట్లు ఉంచి పొయ్యిమీద పెట్టుట. అది ఉడి కేటప్పటికి సరిగ్గా ఆ నీళ్లు సరిపోతవి. వార్చవలసిన అవసరం ఉండదు. దీనినే రాయలసీమలో సరియెసురు, సరెసురు అంటారు.
  • "నే బయట ఉన్నానా? మా ఆయన కుంపటిమీద అత్తెసరు పెట్టి వెళ్ళిపోతారు? మా యెడపిల్లతోనే దాన్ని పొయ్యిమీదినుంచి దింపించి ఉంచుతాను." వా.

అదటడచు

  • పొగ రడచు.