పుట:PadabhamdhaParijathamu.djvu/809

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెవి - చెవి 783 చెవి - చెవి

వాడిదగ్గఱా వీడి దగ్గఱా చేరి చెవి కొఱికి పుల్లింగాలు పెట్టడమే పని." వా.

చెవి కొఱుకు

 • రహస్యము చెప్పు.
 • "గుట్టిడక సెట్టితోఁ జెవి కొఱికి కొఱికి, సరవితోఁ దనకేలికిసానివారి." బహులా. 5. 76.
 • "ఏమిటో వాళ్ళిద్దరూ నన్ను చూచి అలా తిరిగారు. వీడు వాడి చెవి కొఱికాడు." వా.

చెవి కోసుకొను

 • అత్యాసక్తిని చూపు.
 • "వాడు కథ లంటే చెవి కోసుకుంటాడు." వా.

చెవి గూబ లదరు

 • బాగా దెబ్బ తగులు.
 • "చెవిగూబ లదిరేట్టు కొట్టాడు." వా.

చెవి గోసిన మేక వలె

 • మేమే అని అఱచు.
 • శ్రావ్యంగా లేని పాటలు పద్యాలు మొదలగువాని విషయంలో ఉపయోగించే పలుకుబడి.
 • "చెవి గోసినమేకలపోల్కిఁ జాల." గుంటూ. ఉత్త. 32.
 • "చెవి గోసిన మేకలాగా అరుస్తున్నాడు." వా.

చెవిచెంత జేర్చు

 • విను, ఆదరముగా చూచు.
 • "శివచింత చెవిచెంతఁ జేర్ప నతఁడు." జైమి. 1. 86.

చెవి చెక్కు నెఱుగకుండ చెప్పు

 • అతి రహస్యముగా చెప్పు.
 • "చెప్పెద మొకబుద్ధి చెవియుఁ జెక్కు నెఱుంగ,కుండఁ బైతృక మైనయొడమి గలది." భోజ. 6. 144.

చెవిచొరు పాము

 • కర్ణజలూక. శ. ర.

చెవి జెందు

 • వినబడు.
 • "చెవిఁ జెందె వధూమృదుగీతవాదముల్." భోజ. 5.

చెవిటికి పట్టిన సంకు

 • వ్యర్థము.
 • "...అ,క్కట విఫలము గాదే? యె,చ్చటఁ జెవిటికిఁ బట్టినట్టి సంకును బోలెన్." కళా. 2. 96.
 • రూ. చెవిటికి శం కూదినట్లు.

చెవిటి పంచాయితీ

 • అసలు సంగతి తెలియక చెప్పు తీర్పు.
 • "వాడికి సంగతు లేవీ తెలియవు. అనవసరంగా వాడిదగ్గరికి వెడితే ఏదో చెవిటి పంచాయతీ చెబుతాడు. ఏం ప్రయోజనం?" వా.
 • చెవిటి గొల్లవాడు, దారిన పొయ్యే చెవిటి, చెవిటి రాజు కలిసిన కథద్వారా వచ్చినది.

చెవిటి మాలోకం

 • చెవిటి.
 • "మనం ఏ మంటే నేం? పాపం ! ఆమె కేం తెలుస్తుంది? చెవిటి మాలోకం." వా