పుట:PadabhamdhaParijathamu.djvu/802

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెఱ - చెఱ 776 చెఱ - చెఱ

కొట్టుచు, కోపంతో చీదరించుకొనుచు అని కూడ. నేటికీ వాడుకలో 'మహా చెర కొడుతున్నాడే' అంటారు దక్షిణసీమలో.

 • "ప్రవాహోదకంబుల దరి జెర్లు గట్టి యాడంగ." పండితా. ద్వితీ. మహి. పుట. 155.
 • "క్రొన్ననమునికోలఁ గదల్చినం గెరలి చెరలు కొట్టుచు మన్నులపైఁ బాఱు చిలుకవారువంబుల...." శ్రీరం. 2. 295.
 • "ఇక్కడ జెర్లు గట్టి, కొనియాడునట్టి యెక్కుడుముద్దుపట్టి, గొనిపోయె పుత్రు గ్రక్కునఁ బట్టి మొసలి." పండి. మహిమ. ద్వితీయ. పుట. 164.
 • అదే. ద్వితీ. 166.
 • చూ. చెరలుకొట్టు.

చెఱకడము

 • బెల్లము.

చెఱకున పం డొదవినట్లు

 • చెఱకే మధురము. దానికి పండే పుడితే ఇం కెంత మధురముగా ఉండునో అనుటపై వచ్చినపలుకుబడి.
 • ఇలాంటిదే 'బంగారానికి తావి అబ్బు.'
 • చెఱకునకు పం డ్లుండక పోవుట ప్రసిద్ధము.
 • "అఱువదినాలుగు విద్యల, నెఱవాది త్రికాలవేది నీ వీ చిలుకన్, నెఱపుగఁ జేపట్టిన నది, చెఱకునఁ బం డొదవినట్లు చిరకీర్తినిధీ!" విక్ర. 7. 20.

చెఱకుల పందెము

 • చూ. చెఱకుపందెము.

చెఱకు పండినపండు

 • అసంభవము. తాళ్ల. సం. 12. 75.

చెఱకుపండు

 • అసంభవము.
 • కుందేటికొమ్ము వంటిది.
 • "అక్కటా!, చెఱకునఁ బండు పండిన భుజింప దలంపమి గాక ప్రాయపుం, దెఱవలతోడ..." రాజగో. 1. 100.

చెఱకుపందెము

 • చెఱకుగడలను నఱుకుటలో ప్రావీణ్యం చూపుతూ వేసుకునే పందెం.
 • "పికిలిపిట్టలఁ గొట్లాటఁ బెట్టి చూచు, దిట్టతనమునఁ జెఱకుపందెంబు లాడు." కువల. 5. 9.

చెఱకుపాలు

 • చెఱకురసం.

చెఱగున ముడుచుకొను

 • కొంగున కట్టుకొను.
 • ఏదైనా డబ్బును కొంగులో ముడి వేసుకోవడం నేటికీ చాలా చోట్ల అలవాటులో ఉన్నదే.
 • "చెఱంగున ముడుచుకొని." హర. 1. 19.

చెఱగు పెనచు

 • స్త్రీలు సిగ్గూ, తత్తరపాటూ మొదలయినవి కలిగినప్పుడు