పుట:PadabhamdhaParijathamu.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతి_____అతు 54 అత్త_____అట్ట

అతి సర్వత్ర వర్జయేత్

  • ప్రతిదానికీ పరిమితి ఉండాలి అని చెప్పవలసినపుడు అనే మాట.
  • "నీవు మరీ వాడితో అంత పూసుకొని తిరుగుతున్నా వేమిరా? అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు." వా.

అతీ గతీ లేదు

  • దానినిగురించి ఏమీ తెలియదు. జం.
  • "వాడికి పదిజాబులు రాసినా అతీ గతీ లేదు." వా.

అతుకులబొంత

  • చిన్న చిన్న బట్ట పేలికలను అన్నిటినీ చేర్చి, బొంతగా కుట్టడం పల్లెలలో నేటికీ అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి.
  • "ఆ కావ్యం అతుకులబొంతగా తయారైంది. దాన్లో కొంత దీన్లో కొంత తీసి కుట్లు వేస్తే అంతకంటే యేమవుతుంది?"
  • "ఈ అతుకులబొంత సంసారం నేను చెయ్యలే నమ్మా. ఒకటి ఉంటే ఒకటి ఉండదు." వా.

అతుకులసంసారం

  • చాలీ చాలని ఆదాయం గల సంసారం.
  • "మే మేదో అతుకుల సంసారం చేస్తున్నాము. మా కవన్నీ రావా లంటే ఎక్క్క్వడ వస్తాయి?" వా.

అత్తకోక తొలగినట్లు

  • ఏ మనడానికీ వీలు లేనిపరిస్థితి యేర్పడినప్పు డనేమాట.
  • కోక తొలగిం దని చెప్పినా బాగుండదు, చెప్పక పోయినా భా గుండదు.
  • "నక్క యురులలోన జిక్కుకొన్న వితానం, గోరి మనము చేసికొన్న పనికిం, బేగులలోనితీట విత మాయె నన రాసు, అత్తకోక తొలగినటుల బలుక."
  • రాధికా. 3 ఆ.

అత్తగంతు

  • వేశ్యామాతల గుంపు.
  • కుమా. 8. 135.

అత్తగారి సాధింపు

  • ప్రతి చిన్న దానికీ దెప్పిపొడుచుట.

అత్తపోరు

  • అత్త కోడలిని పెట్టుఆరడి.
  • "ఈ సంబంధం చాలా మంచిది. అత్తపోరూ, ఆడబిడ్డపోరూ ఏమీ లేదు. ఒంటిగాడు. లక్షణమైన సంబంధం." వా.

అత్తమామల పోరు లేని కాపురం

  • కొత్తగా వచ్చినకోడలిని అత్తమామలు ఊరికే తప్పు పట్టుతూ పోరి బొక్కలాడుతారు. అట్టి పెద్ద లెవరూ లేని కాపురము. అనగా స్వేచ్ఛ ఉన్న దనుట.
  • "నిలనీని వంటవార్పుల నత్తమామల పోరును లేనికాపురము గలిగె."
  • శుక. 3 ఆ. 66 ప.