పుట:PadabhamdhaParijathamu.djvu/789

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెట్ట - చెట్ట 763 చెట్ట - చెట్ట

 • "తనకుఁ గలయర్థ మంతయు, ననురాగముతోడ నిచ్చి యర్థులచే ని,ర్ధనవృత్తిఁ జెట్టగొనియెను." దశ. 5. 81.

చెట్టడిచిన చేటెడు

 • కావలసినన్ని.
 • అతిసమృద్ధిగా ఉన్న వనుట.
 • "తొట్టిన క్రొవ్వులు గలయవి, చెట్టడి చినఁజేటెఁ డేమి చెప్పం బులుఁగుల్." మను. 4. 24.
 • చెట్టు కదిలించగానే బాగుగా పండి ఉన్న ప్పుడు చేతినిండా పండ్లు రాలును అన్నదానిపై వచ్చిన పలుకుబడి.

చెట్టతనము

 • దుష్టత్వము.
 • "చుట్టాలు నీ దగుచెట్టతనంబునఁ, బాసి పశ్చాత్తాపపరుఁడ వగుచు." భార. అను. 4. 382.

చెట్టపట్టలు

 • చెట్టపట్టాలు.

చెట్టపట్టలు వట్టు

 • చెట్టపట్టాలు పట్టుకొను, ప్రేమతో ఒకరిచేతులలో ఒకరు చేతులు జొనిపి పట్టుకొను.
 • "బంతు లేర్పడఁ జెట్టపట్టలు వట్టి." పండితా. పర్వ. 401. పు.

చెట్టపట్టా లాడు

 • సరస మాడు, చెమ్మ చెక్క లాడు.
 • "చేల లంటి గోపికల చెట్టపట్టా లాడితివి." తాళ్ల. సం. 8. 179.

చెట్టపట్టాలు

 • అన్యోన్యంగా ఒకరిచేతు లొకరు పట్టుకొనుట.
 • చూ. చెట్టపట్టలు.

చెట్టపట్టు

 • వివాహ మాడు.
 • "చెలఁగు శ్రీ కృష్ణరాయలఁ జెట్టపట్టి." కృష్ణ. 4. 24.
 • పాండు. 4. 197.
 • చూ. చెట్టవట్టు.

చెట్ట యగు

 • ద్రోహి యగు.
 • "మీఁదు పరికింపక యమ్మెయి నీవు పాండునం,దనులకుఁ జెట్ట వై." భార. ద్రో. 4. 209.

చెట్ట యొనర్చు

 • కీడు చేయు.
 • "అతి వ్యసనత్వము గల్గువారలుం, జేరువ నున్కి భూపతికిఁ జెట్ట యొనర్చు." భార. శాంతి. 3. 469.

చెట్టలాడు

 • దూషించు.
 • "శ్రీకంఠుభక్తులఁ జెట్ట లాడెదరు." పండితా. ప్రథ. దీక్షా. పు. 128.

చెట్ట వచ్చు

 • కీడు కలుగు.
 • "మయలం జెప్పిన సౌఖ్యము, రయలం జెప్పినను జెట్ట రయమున వచ్చున్." కవిజ. సం. 39.