పుట:PadabhamdhaParijathamu.djvu/788

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెక్కు - చెక్కు 762 చెక్కు - చెట్ట

చెక్కు మీటిన వస వల్చు

  • బాల్యంలో ఉండు.
  • ఇదే అర్థంలో ఉపయోగించేవే 'ఒక చెంపన పాలు, ఒక చెంపన నెత్తురు - చెక్కులు పాలు గారు' - ఇత్యాదులు.
  • చిన్నతనంలో పిల్లలకు వస పోయడం, పాలు పట్టడం సహజం. ఇంకా ఆ పాలు, వస తాగే వయసులోనే వున్నారు అనే అర్థాన్ని సూచిస్తూనే చెక్కులు మీటితే పాలో, వసో కారు తుం దనే పలుకుబడి.
  • "పద్మగర్భాదులకు నీఁతబంటి యనినఁ, జెక్కు మీటిన వస వల్చు శిశువు లెదురె?" జైమి. 6. 245.
  • చూ. చెక్కు పిండిన వస యొలుకు.

చెక్కులు గీటు

  • చెక్కులు పుణుకు (ఆదరముతో, ప్రేమతో.)
  • "చేతి వీణియకుఁ జెక్కులు గీఁటుచు నేర్పుచున్నదో, యన." పారి. 1. 5.

చెక్కులు సేయు

  • ముక్కలు చెక్కలు చేయు.
  • "ఘోరాపారమహాఘపంచకముఁ జెక్కు ల్సేయఁగా నేర్పు నా." ఆము. 4. 31.

చెక్కు లొత్తు

  • మొల కెత్తు, అంకురించు.
  • "పిదపిద నై లజ్జ మదిఁ బద నిచ్చినఁ, జెలిమేనఁ బులకలు చెక్కు లొత్త." భాగ. 10. ఉత్త. 331.

చెక్కు సెమర్పక

  • ఏ మాత్రం అలసట పడక.
  • "క్రిక్కిఱిసి నగరిలోనికిఁ, జక్కన దురదురన చొచ్చి చనుచో నేమిం, జెక్కు సెమర్పక యుండెడు, నక్కొమరునిఁ గాంచి వార లతిదు:ఖితు లై." సారం. 3.35.
  • చూ. చెక్కు చెమర్పక.

చె క్కూదు

  • చెక్కు చేర్చు.
  • "అంది ముద్రితపాణి యందుఁ జెక్కూఁది యా, గమములు వినుచు హేమము పొదివిన." ఆము. 4. 58.

చెక్కేశాడు

  • ఎక్కడికో పాఱిపోయినాడు.
  • "వా డెక్కడికో చెక్కేశాడు. నాలుగురోజులుగా కనిపించడం లేదు." వా.

చెట్టంత కొడుకు

  • ఎదిగిన కొడుకు.
  • "చెట్టంత కొడుకు పోయాడనేసరికి ఆవిడ కుప్పగూలి పోయింది." వా.
  • చూ. చెట్టంత మనిషి.

చెట్టంత మనిషి

  • ఆజానుబాహుడు.
  • "ఆ రాయి కణతకు తగిలేసరికి చెట్టంత మనిషీ కుప్పకూలి పోయాడు." వా.
  • చూ. చెట్టంత కొడుకు.

చెట్టగొను

  • చేపట్టు.