పుట:PadabhamdhaParijathamu.djvu/787

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెక్కు - చెక్కు 761 చెక్కు - చెక్కు

  • "లే జవరాలు చెక్కు గీ,టిన వస వల్చు బాలకుఁడు డెందమునం గలఁగంగ నేర్చు నే." నైష. 1. 17.
  • చూ. చెక్కు మీటిన వస వల్చు.

చెక్కు చెదరక

  • ఉన్న దున్నట్లు. సాక్షి. 336. పు.
  • "షాజహాను కట్టించిన తాజ్ మహల్ నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నది." వా.

చెక్కు చెమరించు

  • అలసిపోవునట్లు చేయు.
  • "ఈ క్రొవ్విరులు గ్రోలు నెలితుమ్మెదలు చెక్కు, చెమరింపకున్నవా చిగురుఁబోడి." విజయ. 3. 62.

చెక్కు చెమరుచు

  • అలసి పోవు.
  • "చిలుక నక్కునఁ బెట్టఁ జెక్కు సెమర్చు." గౌర. హరిశ్చ. పూ. 1696.

చెక్కు చెమర్పక

  • ఏ అలసటా లేక, అవలీలగా.
  • ఏ ఢోకా లేక.
  • "....పురందరనందను బల్మికల్మి ని,శ్చింతత నుల్లసిల్లెదరు చెక్కు చెమర్పక కౌరవేశ్వరా!" భార. శల్య. 1. 50.
  • "ఖరాదియోధుల సంహరించి చెక్కు చెమర్పక." వర. రా. అర. పు. 121. పం. 23.
  • చూ. చెక్కు సెమర్పక.

చెక్కుటద్దాలు

  • అద్దములవలె నున్నగా నున్న చెక్కులు.

చెక్కుడుపాఱ

  • గడ్డి మున్నగువానిని చెక్కే పాఱ.
  • "....కస వారసి తెమ్మని కూఁతు చేతికిం, జెక్కుడుపాఱ యీయ." శుక. 3. 410.

చెక్కున చె క్కాను

  • చెంప చెంప చేర్చు.
  • ప్రేమను సూచించు ఒక చేష్ట.
  • "చె,క్కునఁ జె క్కానుచు నొక్క చన్మొన యుర:కోణంబుతో రాయఁగన్." కళా. 5. 67.

చెక్కు పిండిన వస యొలుకు

  • పసితనంలో ఉండు.
  • చిన్న పిల్లలకు మాటలు వచ్చుటకై వస నూరి పోస్తారు. ఆ వసే బయటికి వస్తున్న దనుట. అనగా చిన్నతనము.
  • ఇలాంటిదే పాలు గారే చెక్కిళ్లు.
  • "చెక్కు పిండిన వస యొల్కు చిఱుత వాని." హరవి. 2. 76.
  • చూ. చెక్కు గీటిన వస వల్చు.

చెక్కు మీటిన వస గాఱు

  • పసితనంలో ఉండు.
  • "చెక్కు మీటిన వస గాఱు శిశువు భక్తి, నుగ్రతప మాచరించుచు నున్న యతని." విష్ణు. 2. 63.
  • చూ. చెక్కు పిండిన వస యొలుకు.