పుట:PadabhamdhaParijathamu.djvu/785

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెంబు - చెకా 759 చెకు - చెక్కి

పలుకుబడి మారుతూ ఉంటుంది.

  • ఏటికి వెళ్లు, కాలవకు వెళ్లు, గుంటకు వెళ్లు, బయటికి వెళ్లు, దొడ్డికి వెళ్లు, పెరటికి వెళ్లు, వెలపటికి వెళ్లు ఇత్యాదులు.

చెంబులో ధనము

  • కొంగుబంగారము. నానా. 68.

చెకపికగా

  • వేగముగా.
  • "....రావోయి! యో, యకలం కాత్మక! వైళ మన్నఁ ద్వరితుం డై నిండువెల్లిం జెకా, పికగాఁ గాల్నడ రాఁ గడంగుట కెదం బ్రీతిల్లువాఁ డెల్లి యౌ." శంకరవిజయకథా. 2. 58.

చెకబికల్ చేయు

  • చెక్కముక్కలు చేయు. ధ్వన్యనుకరణము.
  • "చెకబికల్ చేసి తా నురుముపైఁ గొట్టి." వర. రా. సుం. పు. 153. పం. 12.

చెకబొక లాడు

  • చెండి చెకపిక లాడు. ముక్కలు చేయు.
  • చూ. చెండి చెకపిక లాడు.

చెకాచెకలు

  • చెక్క చెక్కలు.
  • "చెకా చెక లై యవియంగ." రంగా. 3. 198.

చెకుముకిరాయి

  • నిప్పునకై ఱాతిని కొట్టే ఉక్కుముక్క.

చెక్కకొణుజు

  • ఒక పిడుదు. పశువులకు పట్టునది.

చెక్కచెట్టు

  • ఎఱ్ఱరంగు వేయుట కుపయోగించే ఒకచెట్టు. శ. ర.

చెక్కతాపీ

  • తాపీ పనిముట్టు.

చెక్కపిడుజు

  • చెక్కపిడుదు. పశువులకు పట్టే పిడుదు.

చెక్కపీరు

  • చూ. చెక్కకొణుజు.

చెక్కలు చేయు

  • ముక్కలు చేయు.

చెక్కలు వాపు

  • పగుల గొట్టు. జైమి. 5. 72.

చెక్కలు వాఱు

  • ముక్క లగు. భాగ. 6. 32.

చెక్కికొను

  • చెక్కొను.

చెక్కిట నద్దుకొను

  • చెంపలకు అద్దుకొను, ప్రమతో, ఆదరంతో.