పుట:PadabhamdhaParijathamu.djvu/782

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూఱ - చూలు 756 చూలు - చెంగో

  • "పమ్మినబాళి నంటి యెలప్రాయము చూఱ లొసంగె వానికిన్." శుక. 2. 556.

చూఱవట్టు

  • చూఱపట్టు.

చూఱ విడుచు

  • వదలి వేయు, ఎవరికో అప్పగించు.

చూఱ వుచ్చు.

  • కొల్ల వుచ్చు.
  • దొంగలకు అప్పగించు. దొంగలకు కాక పోయినా సరే పరిపూర్తిగా వదలివేయు అని కూడా వాడుకలోనికి వచ్చినది.
  • "తన బండారువు నూఱవుచ్చె నొకొ కందర్పుండు." కుమా. 10. 32.

చూఱవోవు

  • కొల్లబోవు, నశించి పోవు.

చూఱాడు

  • అపహరించు.

చూలాలితనము

  • గర్భిణీత్వం. భాగ. 8. 502.

చూలుకొను

  • గర్భ మగు. కాశీ. 4. 60.

చూలు చేయు

  • గర్భము చేయు.
  • "తారకావల్లభుండు, చూలు చేసిన వాఁ డంచు సూక్ష్మఫణితి." కాళ. 4. 229.

చూలువడు

  • గర్భముతో నుండు. శ. ర.

చెంగ గొట్టు

  • ఓడించు.
  • "సింగపు గుంపులఁ జెంగగొట్టిన వాఁడు." భాను. 2. 209.

చెంగ గొను

  • దాటు; జయించు.
  • "లంకాప్రాకారంబు చెంగ గొని." భాస్క. యుద్ధ. 910.

చెంగలి గొను

  • చెంగలించు, ఎక్కు వగు. చెంగు చెంగున దాటుటలో వలె ధ్వన్యనుకరణ మై వచ్చి ఉంటుంది.
  • "చెరలాడు చెయ్వులు సెంగలి గొనఁగ." పండితా. ద్వితీ. మహి. పుట. 133.
  • చెంగలించు తప్ప, చెంగలి గొను కోశములలోనికి ఎక్క లేదు.

చెంగావి

  • ఒక రకమైన ఎరుపు.
  • "చెంగావి పంచలు నెల్లూరివా ళ్లెక్కువగా కడతారు." వా.

చెంగోలు

  • అధికార సూచక మగు దండము.
  • శెన్ కోల్ అని తమిళము.