పుట:PadabhamdhaParijathamu.djvu/764

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీడు - చీనా 738 చీనా - చీపు

చీడుదబ్బ

  • వెదురుబద్దలతో గుమ్మటంలా కట్టిన నేసేవారి పనిముట్టు. హంస. 2. 10.

చీదక న్నిడు

  • శీతకన్ను వేయు, నిర్లక్ష్యము చేయు.
  • "బహువిధంబులఁ బలుకు నా పలుకు లెల్లఁ, జీఁదక న్నిడి తన పెడచెవులఁ బెట్టి." భార. ఉద్యో. 4. 76.

చీదర చెందు

  • చికాకుపడు.
  • "ఇందీవరభ్రాంతిచే, మెలఁగం జేరలఁ గప్పుకో నలవి గామిం జీదరం జెంది." పారి. 4. 14.

చీదఱలు గొలుపు

  • చీకాకు పెట్టు.
  • "శంఖభేరిరావములు దిగ్దంతుల చెవులు చీఁదఱలు గొలుప." జైమి. 5. 3.

చీదఱ వాపు

  • దు:ఖము తీర్చు; చికాకు, కలత తొలగించు. కుమా. 8. 159.

చీది వేయు

  • ఏడ్చు.
  • "ఏమిట్రా ! మీ అక్క చీది వేస్తూ కూర్చుంది?" వా.

చీనకర్పూరము

  • ఒక విధమైన కర్పూరం.

చీనాచక్కెర

  • ఒక రకమైన చక్కెర.

చీనాపంచదార

  • ఒక రకమైన చక్కెర.

చీనిచక్కెర

  • ఒక రకమైన పంచదార.
  • "ఒక్కొక్కయెడఁ జీని చక్కె పానకం, బానిన ట్లాహ్లాద మావహిల్ల." రాజగో. 1. 18.
  • రూ. చీనాచక్కెర.

చీనిపావడా

  • మంచి పావడా. చీనాంబరం లాంటిదే. చీనా దేశంనుండి వచ్చే బట్ట ఆనాడు సున్నిత మై వచ్చిన మాటలివి.
  • "తొడవులు పుచ్చి నిర్జరవధూటుల వేలుపు మాని చీని పా,వడల ధరించి." పారి. 4. 24.

చీనిపిష్టము

  • సిందూరము.

చీనీలు

  • ఒక రకమైన బట్టలు. ప్రబంధ. 615.

చీపురుకట్ట తిరుగ వేయు

  • దండించు; అవమానించు ముఖ్యంగా స్త్రీ.
  • "ఆ పిల్లను అదీ యిదీ అన్నా వంటే చీపురుకట్ట తిరగ వేస్తుంది." వా.

చీపురుకట్ట సరసం

  • మోటుసరసం.
  • "వాళ్ల దంతా చీపురుకట్ట సరసం లే." వా.