పుట:PadabhamdhaParijathamu.djvu/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అడు_____అడు 46 అడు_____అడు

అడుగున పడు

 • విస్మృత మగు.
 • "వాడు కౌముది అంతా చదువుకున్నాడు. కాని అది అంతా యిప్పుడు అడుగున పడి పోయింది." వా.
 • "నా అర్జీ అడుగున పడి పోయింది. విచారించేనాథుడు లేదు. వా.

అడుగుపఱచు

 • తక్కువపఱచు.
 • "లలి గొ ప్పెక్కించితి మధుపుల, శుకులను నడుగుపఱచి పుష్పాస్త్రా! మా,లలకును మంచంబులు బా పలకును బీట లనుమాట బళి నిజమయ్యెన్." చంద్రా. 5. 91.

అడుగు పెట్టకుండు

 • ముందుకు సాగకుండు.
 • "...ఎంత చేసిన నాసింహ మెదుటి కడుగు వెట్ట దయ్యెను." కళా. 3. 86.

అడుగు బట్టు

 • మూలబడిపోవు, క్రిం దగు.
 • "బలు సెక నించువి ల్లడుగుబట్టినదే యిపు డాకు బూదిగెంపుల ద్రిరుచిత్వ మూది." ఆము. 4. 96.

అడుగు బడుగు

 • కుండలో ఆఖరున మిగిలినది.
 • "కాస్త అడుగో బడుగో యేదో ఒకటి వేయం డమ్మా. ఆకలిగా ఉంది." వా.

అడుగుభద్రం<.big>

 • నెమ్మది, నిదానం, పదిలం.
 • "వాడు వట్టి అడుగుభద్రం లేనిమనిషి. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీదు." వా.
 • చూ. అడుగు లేనిగిన్నె.

అడుగు మాడు

 • చూ. అడుగంటు.

అడుగుమనిషి

 • పాదసేవకుడు.
 • పాండు. 4. 304.

అడుగు మాలిపోవు

 • నిర్మూల మగు.
 • "అనుజ తనుజులు జెలులు వియ్యములు నడుగు, మారిసోదరు నీకు గా మనుజ నాథ!, దొరకు గులనాశనుం డనుదూఱు మేలె, పాండవులతోడ నొడ గూడి బ్రదుక వయ్య."
 • భార. ఉద్యో. 3. 341.

అడుగు ముట్టా

 • పూర్తిగా.
 • "ఆవిషయం అడుగుముట్టా తెలుసుకునే దాకా వదిలిపెట్ట దలచుకో లేదు." వా.

అడుగులకు మడుగు లొడ్డు (లొత్తు)

 • అతిభక్తితో సేవించు.
 • పూర్వం ఎవరైనా గొప్పవారు వస్తే వారి అడుగులు నేలకు తగులకుండా ఉతికిన బట్ట పరచి దానిమీద నడిపించుకొంటూ వచ్చేవారు. అందుపై వచ్చినపలుకుబడి. ఇప్పటికీ కొందఱి పెండ్లిండ్లలోనూ, శ్రాద్ధాలలోనూ గౌరవసూచకంగా బట్టలు పఱచి నడిపించుట కానవస్తుంది.