పుట:PadabhamdhaParijathamu.djvu/706

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చచ్చి - చచ్చు 680 చచ్చు - చట్ట

లేక పోయాడు. చావబోతుండగా రెడ్డి వచ్చి యింకా పగ ఎందు కని పలుకరించాడు. అప్పు డతను రెడ్డిగారి దొడ్డికి దక్షిణాన తన్ను కాల్చ మని కడపటి కోరికగా కోరాడు. పాపం! కడపటి కోరిక గదా అని రెడ్డిగారు అలాగే చేశారు. గాలి కాకాష్ఠంలో అగ్గి రెడ్డిగారి దొడ్లో పడి వాము లన్నీ కాలి పొయ్యాయి. 'చచ్చి సాధించాడు రా ముండాకొడుకు' అన్నా డట రెడ్డి.

చచ్చి సున్న మగు

 • విపరీతముగా శ్రమించు.
 • "వీడికి చదువు చెప్ప లేక చచ్చి సున్న మవుతున్నాను." వా.
 • చూ. చచ్చి చెడి సున్న మగు.

చచ్చుదద్దమ్మ

 • చూ. చచ్చు పెద్దమ్మ.

చచ్చునాగమ్మ

 • చూ. చచ్చుదద్దమ్మ.

చచ్చు పీనుగ

 • 1. వెధవ. ఒక తిట్టు. కొత్త. 271.
 • 2. ఏమీ చేత కానివాడు. మదన. 30.

చచ్చుపుచ్చు

 • పనికి రాని.
 • "ఈ చచ్చుపుచ్చు కబుర్లన్నీ నా దగ్గఱ పనికి రావు." వా.
 • "వీడు తెచ్చిన వన్నీ చచ్చుపుచ్చు వంకాయలే." వా.

చచ్చు పెద్దమ్మ

 • దద్దమ్మ.
 • "వాడు వట్టి చచ్చు పెద్దమ్మ. ఎవరే మన్నా పడతాడు." వా.

చచ్చౌకము

 • చచ్చదరము.
 • నాలుగువైపుల చదరముగా నున్నది.
 • "చచ్చౌక మేర్పడి సరసంపుభువిని." పల. పు. 33.
 • చూ. చచ్చవుకము.

చటులపడు

 • మడగబడు, కుంటుపడు.
 • "ఆకాశవాహిని సైకతంబుల ఖురాం,చల టంకముల్ గ్రుంగఁ జటుల పడిన." కాశీ. 3. 12.

చట్టలు చీరు

 • చంపు. రామా. 7. 265.

చట్టలు దూయు

 • చంపు. వరాహ. 6. 22.

చట్టలు ద్రుంచు

 • చంపు.

చట్టలు పట్టుకొను

 • ఒకరిచేతు లొకరు పరస్పరం పట్టుకొను.