పుట:PadabhamdhaParijathamu.djvu/703

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చక్కీ - చక్కు 677 చక్కు - చక్కె

చక్కీ పంచదార

 • శుద్ధి చేసిన చక్కెర. బ్రౌన్.
 • గడ్డ కట్టిన చక్కెర. వావిళ్ళ. ని.

చక్కీ మంచము

 • పేము మొదలగువానితో నేసిన చట్టం గల మంచం.

చక్కుగా జేయు

 • చక్కు సేయు.
 • "పొలుపారు సౌధగోపురములతోడఁ, గాశీపురము చక్కుగాఁ జేసి కాల్చి." ద్విప. జగ. 175.
 • చూ. చక్కు చేయు.

చక్కు చేయు

 • 1. తుత్తుమురు చేయు.
 • "తుందుడు కాఱ శాత్రవుల దోర్బల సంపదఁ జక్కు చేసి." నిరంకు. 4. 80.
 • చూ. చక్కాడు.
 • 2. నిర్మూలించు.
 • "శర మేర్చి యిపుడె, చంద్రసూర్యాగ్నులఁ జక్కుఁ చేసెదను." వర. రా. అర. పు. 231. పం. 3.
 • రూ. చక్కసేయు.

చక్కుపగడ

 • ఏడో సంఖ్య. వేంక. మాన.

చక్కుముక్కు చేయు

 • చిందరవందర చేయు.
 • "ఎక్కడి పగ యొకో యింద్రియాలు నన్నుఁ బట్టి, చక్కుముక్కుల చేసి యెంచి సాధించేని." తాళ్ల. సం. 6. 105.

చక్కువడు

 • ముక్కలు ముక్క లగు.
 • "అక్కిరీటి సైన్యంబు లెక్క గొనక, యుక్కు మిగిలి యక్కజంబుగాఁ, జక్కువడం బెక్కు నారసంబులు." జైమి. 5. 20.

చక్కెర తిన్ననోర వేపాకు మేసినవిధము

 • మంచిపని చేసినపిదప చెడుపని చేయ రా దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "తీపారుచక్కెరఁ దిన్న యానోర, వేపాకు మేసినవిధమున నీవు, చేసి నంతయు మేలు చేసి మ ఱేల, చేసితి విట్టి కుచ్చితము...." గౌర. హరి. ద్వి. 1281-'84

చక్కెర పెట్టు

 • తీపి తినుబండము పెట్టు.
 • "కనకపంజరశారికలకుఁ జక్కెర వెట్టి, చదివింప రేలొకో సకియ లిపుడు." పారి. 1. 106.

చక్కెర బుగడ

 • ఒక రకమైన పిండివంట.

చక్కెర బెట్టి లాలించు

 • ప్రేమతో పెంచు.
 • "ప్రేమతోఁ జక్కెర వెట్టి లాలించిన, చిలుకకే వెగటుగాఁ బలుక సాఁగె." ఉషా. 2. 47.

చక్కెరబొమ్మ

 • అందగత్తె.