పుట:PadabhamdhaParijathamu.djvu/699

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్ర - చంద్రు 673 చంపి - చంపు

చంద్రగోళి

  • చంద్రపు గిన్నె.
  • అంచు లేని గుండ్ర మైన గిన్నె. పక్షులు నీరు త్రాగుటకూ, మనం చేతులు కడుగు కొనుటకూ ఇత్యాదులకు అందులో నీరు ఉంచుతారు. గోళెము అన్నది కొంచెం వెడల్పాటి అంచు లేని గిన్నె కే నేడు కూడా రూఢము.
  • "క్షాళనోచితచంద్రగోళి యనఁగ." పాండు. 5. 24.
  • చూ. చంద్రపుగిన్నె.

చంద్రపుగిన్నె

  • అంచు లేని గుండ్ర మైన గిన్నె.
  • "చక్రవాకములకుఁ జల్లఁగా మంచు ద్రా,గించిన చంద్రంపు గిన్నెవోలె." ఉత్త. హ. 3. 86.
  • చూ. చంద్రగోళి.

చంద్రవంక

  • ఆభరణము.

చంద్రవంకలు

  • ఒక రకమైన ధాన్యం.

చంద్రుని కొక నూలిపోగు

  • తగినంత కాక పోయినా యెంతో కొంత ఆరాధన చేత నైన కానుక.
  • చంద్రదర్శనం చేసుకొన్నప్పుడు - ముఖ్యంగా విదియనాడు - ఉత్తరీయంలోని నూలిపోగు తీసివేసి నమస్కరించుట ఆచారం. దానిపై వచ్చిన పలుకుబడి.
  • "కావున సమస్తసామ్రాజ్యకర్త యైన, యిందిరాధీశునకుఁ గాను కీయవలయుఁ, జంద్రునకు నూలుపో గన్న సామెతగను, గాన నేమైన మనశక్తి గలకొలంది." కుచే. 1. 109.
  • "మీరు చేసేది గొప్ప సత్కార్యం. వేలమీదా లక్షలమీదా కావలసిన పని. చంద్రుని కొక నూలిపోగు లాగా నేనూ ఒక పదిరూపాయలు యిచ్చుకుంటాను." వా.

చంపి పుట్టు

  • వారికంటె మించినవా డగు.
  • "వాడు వాళ్లనాన్నను చంపి పుట్టాడు." వా.
  • "రావణాసురుణ్ణి చంపి పుట్టినాడు వీడు." వా.
  • అనగా అతనికంటె మించినవాడని అర్థం.
  • నిరసన సూచించు పట్టులనే యిది యెక్కువగా ఉపయోగిస్తారు.

చంపుక తిను

  • వేధించు, బాధించు.
  • "పదిరూపాయలు అప్పు ఇమ్మని వాడు నాలుగు రోజులనుంచీ నన్ను చంపుక తింటున్నాడు." వా.
  • రూ. ఏటికి చంపెదరు?

చంపుకు తిన్నట్టు

  • రూ. నను చంపుకొన్నట్టు.