పుట:PadabhamdhaParijathamu.djvu/698

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద - చంద 672 చంద - చంద్ర

నోరూర్చుకొనుట. వట్టి ఆశ.

 • "అందనిపంటి కేమిటికి నఱ్ఱు నిగిడ్చెదు విష్ణుఁ డున్న యా, కందువ చందమామ గుటకల్ విను మీ పని గట్టిపెట్టి..." వి. పు. 2. 51.
 • చూ. చందమామ ఘుటిక. చందమామ గ్రుక్కిళ్ళు.

చందమామ గ్రుక్కిళ్ళు

 • దొరకనిదానికై వట్టి ఆశతో గుటకలు మ్రింగుట.
 • "ఎలమి సుముహూర్తమునఁ దెర యెత్తు నంతఁ, బ్రేమ మది మీఱఁగాఁ జందమామ చెలుల, కెంపు మోవుల సుధకు గ్రుక్కిళ్ళు మ్రింగ, క్షితిఁ గలిగె జందమామ గ్రుక్కిళ్ళు నాఁడు." శశాం. 5. 137.
 • చూ. చందమామ గుటకలు. చందమామ ఘుటిక.

చందమామ ఘుటిక

 • వట్టి ఆశ. ఎదురుగా ఉన్నదని దొరకనిదాని నాశించుట. చందమామను చూచి గుటకలు వేసినట్లు. ఎలాగూ దొరకదు.
 • పిల్లలకు చందమామను చూపుతూ వట్టి చేతులతో తినిపించగా తినునట్లు వారు నటింతు రని సూ. ని. సరియని తోచదు. గుటకలు వేయుటయే ఇక్కడ.
 • "మనకు నిజ మయ్యె నల చందమామ ఘుటిక." భీమ. 2. 135.
 • చూ. చందమామ గుటకలు.

చందమామ పక్కె

 • ఒక రకమైన చేప. బ్రౌన్.

చందమామ పురుగు

 • ఆరుద్రపురుగు. బ్రౌన్.

చందమామ పులుగు

 • చకోరపక్షి.

చందా కెంపు

 • ఒక జాతి కెంపు.
 • "మేనఁ జందాకెంపు మించుటొడ్డాణంబు." సమీర. 2. 67.

చందాదారు

 • చందా కట్టువాడు.

చందుచట్టు

 • చంద్రకాంతం.

చందురకావి

 • లేత కావి రంగు.
 • "విశద ముక్తాదామ రశనఁ జందుర కావి, కలికపు వలువపై నలవరించి." మను. 6. 5.
 • చూ. చంద్రకావి.

చందురజోతి

 • ఒక రకం బాణసంచా. శ. ర.

చందురుకూనలు

 • నఖక్షతాలు.

చందురువంకలు

 • నఖక్షతాలు.

చంద్రకావి

 • లేత కావిరంగు. రాధి. 1. 99.