పుట:PadabhamdhaParijathamu.djvu/697

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంటి - చండ్ర 671 చండ్ర - చంద

చంటివాడు

  • పాలు తాగే పసివాడు.

చండశాసనుడు

  • నిర్దాక్షిణ్యంగా తప్పును శిక్షించువాడు.
  • "అతనా చండశాసనుడు! నీ సిఫారసు లేవీ పని చెయ్య వక్కడ." వా.

చండాలవాటిలో బ్రాహ్మణ గృహము వెదకు

  • వ్యర్థప్రయత్నము చేయు. మాలగూడెంలో బాపన యింటికోసం వెదకడం వ్యర్థమే కథా !
  • "వసుధ నెం దైనఁ జండాల వాటిలోన, బ్రాహ్మణగృహంబు వెదకుట భ్రాంతి గాదె." ప్రభా. 4. 160.

చండిపోతు

  • మొండివాడు.
  • "మొండరి చల్లచప్పుడు గోడచేర్పు, చండిపో తనునట్టిజాడ నున్నాఁడు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1497-98.

చండి వడు

  • మొండి కెత్తు.
  • "మజ్జనక్రీడాపరాయణం బై చండివడి కదలమిన్." పారి. 5. 13.

చండి సేయు

  • మొండికి వేయు, కోపించు.
  • "చండి సేసి యడిగినఁ జక్క మాకుం జెప్పదు." తాళ్ల. సం. 3. 626.

చండ్రనిప్పులు

  • భగభగ లాడు నిప్పులు.
  • చండ్రకఱ్ఱ కాల్చిన నిప్పులు చాలా వేడి అనుటపై ఏర్పడినది.
  • "చండ్రనిప్పులకంటె వేండ్రంబు లగునట్టి, కన్నులఁ గోపాగ్ని కణము లురల." హరిశ్చ. 3. 91.

చండ్రమల్లెలు

  • చండ్రనిప్పుల మంటలు.
  • "రవరవ మండు నెర్రని చండ్రమల్లెల." క్రీడా. పు. 48.

చండ్రలాటలు

  • ఒక పిల్లల ఆట. హంస. 3. 146.

చందనకావులు/

  • ఒక రకమైన బట్టలు. పండితా. పర్వ. 307. పుట.

చందన మలదు

  • గంధము పూయు.
  • "అలఁదెఁ జందన మొక ధవళాయతాక్షి." పారి. 2. 12.

చందమామ కొండనాలిక

  • చందమామ చిఱునాలిక వంటిది. అనగా తెల్లనిది, మృదు వైనది, సన్ననిది అనుట. చందమామే లలితం. అంతకంటె లలితాతిలలితం.
  • "చందమామ కొండనాలిక యగు నొక్క గొమలిరేకు." క్రీడా. పు. 57.

చందమామ గుటకలు

  • దొరకనిదానికై ఆశపడి