పుట:PadabhamdhaParijathamu.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడ_____అడి 41 అడి_____అడి

  • "అరహతముని వోయి యడవుల గలసె." బస. 6. ఆ. 165 పుట.

అడవులపా లగు

  • చెల్లాచెద రయి పాఱిపోవు.
  • "ఆ కలకలమున జిత్తం బాకులతం బొంద దొంగ లడవులపా లై."
  • కా. మా. 4. 104.

అడవుల వెన్నెలలు

  • పైపై తళుకులు.
  • తాళ్ళ సం. 5. 24.

అడసాల

  • వంటశాల.
  • అడ, అడు, అడి - వంట అన్న అర్థంలో కన్నడమున ప్రచురంగా ఉన్న పదాలు. అడసాల, అడబాల ఇందులోనుండి వచ్చినవే.

అడవులుపట్టు

  • దేశంమీద పోవు.
  • "ఆ యజమాని కాస్తా గటుక్కు మనే సరికి ఆకుటుంబం అంతా అడవులుపట్టి పోయింది." వా.

అడావడి చేయు.

  • హడావుడి చేయు.
  • "తొడలయందం బడావడి నొనర్ప." శ్రవ. 3. 25.

అడిగంట్లు

  • అడుగులూ బడుగులూ.
  • "ర, త్నాకర రత్న రాసు లడిగంట్ల." కవిక. 1. 11.

అడిగండ్లు మడిగండ్లు

  • అడుగు బడుగూ.
  • మిగులూసగులూ అనుట. జం.
  • "అడిగండ్లు మడిగండ్లు తిరిప మిడెడు కటికిదేబె లెల." వేమన.
  • శ. ర. లో అడుగు కండ్లు అనుకొని అడుగున నిలిచిన రాళ్లు అని అర్థ మిచ్చుట సరి కాదు.

అడిగఱ్ఱ

  • పాదదాసుడు.
  • "హరగణంబుల కెల్ల నడిగఱ్ఱ ననిన." ప్రభు. 8. 188.

అడిగించుకొను

  • ఒకరితో నీతి చెప్పించుకొను, ఒకరు అనుటకు వీలుగా తప్పు దారి నడుచు.
  • "విన్నావొ వినవొ నీతి స, మున్నతు లడిగించుకొనగ నొప్పనివి ధరన్." నిరం. 3. 25.

అడిగి కొను

  • బ్రతిమాలు.
  • "అడిగికొన్నను మొగం బిడనీనిచెక్కిళ్లు ప్రేమ దీఱగ ముద్దుపెట్టి పెట్టి." కవిరా. 5. 188.
  • "ఇట్లా చేయవద్దురా అని ఎన్నోవిధాల అడుక్కొన్నాను. వాడు వింటేనా?" వా.

అడిగినయంతలోన

  • అడిగినదే తడవుగా, వెంటనే.
  • "అడిగినయంతలోన సరసాన్నములన్ సమకూర్చు." పారి. 1. 61.

అడిగేవాడు లేడు.

  • అడ్డుపెట్టువా రెవ్వరూ లేరు.