పుట:PadabhamdhaParijathamu.djvu/653

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుడు - గుడ్డ 627 గుడ్డి - గుడ్డి

చారి యై లోకముమీఁద విఱుచుకొని పడి..." సాక్షి. 109.

గుడుగుడు ప్రాణంగా

  • వచ్చే పొయ్యే ప్రాణంగా.
  • "వాడిపరిస్థితి గుడు గుడు ప్రాణంగా ఉంది." వా.

గుడుగుడు మని నడచు

  • గునగున నడచు.
  • "అడుగులు పుడమిని వడి నిడి, గుడు గుడు మని నడచి." పార్వ. 4. 163.

గుడుసు పఱచు

  • తక్కువ చేయు; హీనము చేయు.

గుడుసువడు

  • శూన్య మగు; హీన మగు.
  • "గుడుసువడెఁ జదువు." తాళ్ల. సం. 11. 3 భా. 103.

గుడ్డవృత్తులు

  • ఇనాము భూములు.
  • గుడ్డము - ఊరవాకిలి. ఊర గవిని.
  • పశ్చిమాంధ్ర ప్రాంతంలో నేటికీ ఊరగవిని అనే అర్థంలో 'గుడ్డం' అని ఉపయోగిస్తారు. గూడెమునకు ఈ గుడ్డమునకు సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. గుడ్డవృత్తు లనగా గ్రామం సమష్టిమీద ఆయగాళ్ళు మొదల్గువారికి ఇచ్చే యినాము భూములు కావచ్చును.
  • "గుడ్డవృత్తులు వృత్తులు గొలుచు గుత్త చేలు..." పాండు. 3. 16.

గుడ్డిగవ్వ చేయదు - (డు)

  • బొత్తిగా పనికి రానిది, విలువ లేనిది.
  • ఒకానొక కాలంలో గవ్వలు అతి తక్కువైన కనీసపు నాణ్యాలుగా ఉండేవి. అందులో గుడ్డిగవ్వ మరింత తక్కువ.
  • "వాడి పాండిత్య మంతా ఆ ఊళ్లో గుడ్డిగవ్వ చేయదు." వా.
  • "వాణ్ణి తిప్పి తిప్పి వేలం వేసినా గుడ్డిగవ్వ చేయడు." వా.

గుడ్డిగా

  • విచక్షణ లేక, ముందుచూపు లేక.
  • "ఆవెధవసావాసం పట్టాడు. అప్పటి నుండీ గుడ్డిగా వాడు చెప్పిన ట్లల్లా వినడం తప్ప స్వబుద్ధితో ఏమీ చేయడం లేదు." వా.

గుడ్డి గుఱ్ఱపు తాపు

  • తాకితే తాకుతుంది, తప్పితే తప్పుతుంది. గట్టిగా తగులు నని కూడ.
  • నారాయణ దాసు రుక్మిణీకల్యాణము.

గుడ్డిదర్బారు

  • విచక్షణ లేని పెత్తనం.
  • "వాడి దంతా గుడ్డి దర్బారు. మంచి అంటే మంచి. చెడ్డ అంటే చెడ్డ." వా.