పుట:PadabhamdhaParijathamu.djvu/641

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుండి - గుండు 615 గుండు - గుండె

గుండియలు క్రుళ్ల దన్ను

 • బాగుగా తన్ను.
 • "గుండియలు గ్రుళ్ళఁ దన్నిన గ్రుక్కు మిక్కు, రనక యాతని కినుక చల్లాఱ నిచ్చి." శుక. 3. 627.
 • వాడుకలో - గుండెలు కుళ్లేట్లు తంతాను.

గుండుకొను

 • గుంపు కట్టు.
 • "గుండుకొని చూచుమానిసి, తండముఁ దొలఁగంగఁ ద్రోచి తత్కరివెస నా, చండాలుఁ దెచ్చి తత్కరి..." వాసి. 4. 103.

గుండుగల్లు దాచిన పెండ్లి చెడునె

 • వివాహ సందర్భంలోనే సన్నికల్లు త్రొక్కిస్తారు. ఒక వేళ ఆ గుండ్రాయి దాచి పెట్టినంతమాత్రంతో పెండ్లి ఆగుతుందా? ఆగ దనుట. ఇలాంటిదే "అయ్యవారు లేక పోతే అమావాస్య నిలుస్తుందా?"
 • "మును గుండుగల్లు డాఁచినఁ బెండ్లి సెడునె, చెనసి బిచ్చమ్ము మాన్చిన భక్తి సెడునె." పండితా. ప్రథ. పురా. పుట. 383.
 • చూ. గుండ్రా డాచిన...

గుండుగిలు

 • చాపచుట్టగా పడు.

గుండుగుత్త

 • సర్వహక్కులతో ఇచ్చేగుత్త. బ్రౌన్.

గుండు గూడు

 • గుంపుకట్టు; కలిసి ప్రయత్నించు.

గుండు గూలగ గొట్టు

 • పొడిపొడి చేయు. రుక్మాం. 3. 10.

గుండుజల్ల

 • పెద్ద జల్ల.

గుండులు నీరుగా

 • రాళ్లు కరిగేటట్లు.
 • "చాండాలికన్ మీటుచున్, గుండుల్ నీరుగ నెండ గాలి పసి తాకుం జూడ కాప్రాహ్ణమున్." ఆము. 6. 7.

గుండు వేయు

 • ఫిరంగో, తుపాకో పేల్చు.

గుండు వేస్తే అందకుండా వెళ్ళు

 • కనిపించకుండా పోవు.
 • "గుండు వేస్తే అందకుండా వెళ్ళావు - ఏ మయ్యావు రా ఇన్నాళ్లు." వా.

గుండుసున్న అగు

 • పని చెడిపోవు.

గుండుసూది

 • తలపై పూజగా ఉన్న సూది.

గుండె ఆగి పోయింది

 • అత్యాందోళనను తెలిపే పలుకుబడి.
 • "అతను వస్తాడు వస్తా డని ఆరునెల్ల నుంచీ కాచిపెట్టుకొని ఉన్నానా? రానని తంతి వచ్చేసరికి నా గుండె ఆగి పోయింది." వా.