పుట:PadabhamdhaParijathamu.djvu/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పై వాక్యం ఎక్కడో ఏ మహావిద్వాంసుడో, మహా కవో ఉపయోగించే అపూర్వభాషావిశేషం కాదు. మీరూ, మేమూ ప్రతి పల్లెపట్టునా, ప్రతి రచ్చపట్టునా ఏనాడు పడితే ఆనాడు వినే అవకాశ మున్నదే - వింటున్నదే - ఆ మాట.

అంటే, తనలోని ఏదో ఒక విశిష్టమూ ఉజ్జ్వలమూ తీవ్రమూ అయిన భావాన్ని వినిపించుటకూ, ఎదుటివారి మనసున సూటిగా అంతగానూ నాటునట్లు చేయుటకూ ప్రయత్నించుటలో ఇలాంటి విశిష్టపదబంధాలను ప్రతి తెనుగు తల్లీ, తండ్రీ, పిల్లలూ సృష్టిస్తూనే వున్నారు. తత్ఫలితంగానే అనేకం భాషలో ప్రవేశిస్తున్నవి.

పై వాక్యాన్ని అలాగే మఱొకభాషలో ఏ పదానికి ఆ పదాని కున్న అర్థమూ, వాక్యంలో కారకం అవీ చూచి, వ్యాకరణయుక్తంగా అర్థం చెప్పి, అలాగే అనువదిస్తే ఆ నిర్దిష్ట మైనభావం ఛస్తే రాదు.

అందుకనే అది నుడికారము, తెనుగునుడులలోని ఒకానొక విశిష్టపదబంధవైచిత్రి అనుకుంటాన

ఇది తెనుగులోనే కాదు. ప్రతిభాషలోనూ వున్నదే. మన కిక్కడ ప్రసక్తం తెనుగు గనుక తెనుగసంగతే అనుకుంటున్నాము.

'ఒళ్ళంతా జెఱ్ఱులు ప్రాకిన ట్లున్న'దన్నప్పుడు మనకు తోచే భావస్ఫూర్తి కవి గ్రహించే తా నా మాటల వేటకు దిగి మఱింత వాటంగా చెప్పడం ఆరంభించాడు. అందుకే ఇవి కవితాలతాంకురానికి ఆలవాలము లనుట.

ఇలాంటి నుడికారాలు అనేకవిధాలుగా వున్నవి.

కొన్ని మనిషిఅవయవాలపై ఏర్పడినవి. నెత్తిన నోరుపెట్టుకుని చెప్పడం మొదలు, కాలికి బలపం కట్టుకొని తిరగడం దాకా ప్రతి అవయవంపైనా ఎన్నో కొన్ని నుడికారాలు ఏర్పడినవి.