పుట:PadabhamdhaParijathamu.djvu/550

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంటె____కొండ 526 కొండ____కొండ

కొంటెభాగోతులు

 • కొంటెకోణంగులు. కుక్కు. 22.

కొండ !

 • అదే గొప్ప, ఘనకార్యం.
 • "రండల కొడుకులు యాచక, తండంబుల కేమి త్రవ్వి తల కెత్తేరా, రెండాకు లొక్క పోకయు, గొండ సుమీ దానశర్వ కోమటి గుర్వా!" - చాటువు.
 • "కొండధరించుట నాకొక కొండా ?" హరి. పూ. 7. 179.

కొండంత.....

 • ఎక్కు వైన; గొప్ప అయిన.
 • "కొడుకు పుట్టెడు నని కొండంత యాసతో, నుండంగ దుది గూతు రుద్భవించె." భోజ. 3. 140.

కొండంత కనకము పోకకు వెలా

 • అసంభవ మనుట, పోక కంత వెలా? తాళ్ల. సం. 9. 285.

కొండంతటి దేవర

 • గొప్ప దైవము. సారం. 1. 16.

కొండంత దేవరకు కొండంత పత్రి పెట్ట గలమా ?

 • గొప్పవారిని అంత గొప్పగానూ గౌరవించ లే మనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "కొండికలము మన కెంతటి, దండి గలుగు నధికవస్తుతతి హరి కొసగన్, గొండంత దేవునకు మఱి, కొండంతయు బత్రి యిడెడు కుశలులు గలరే?" కుచే. 1. 110.

కొండంత పని

 • పెద్ద పని.
 • "అకట ! మోసంబు లేదు కొండంత పనికి, నైన బతిమాలి నీవు పొ మ్మన్న వెడలి." శుక. 2. 376.
 • కొండంత అన్నది గొప్ప అనే అర్థంలో చాలా రూపాలలో కానవస్తుంది.
 • చూ. కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టగలమా? సా.
 • "కొండంత రెడ్డి వచ్చి కొంగు పట్టుకొంటే ఊ అనగుడీనా (గూడునా?) ఆ అనగుడీనా? (గూడునా?)" సా.

కొండకోతి

 • 1. కొంటె కోణంగి.
 • "దానితో నేం లే. అది వట్టి కొండకోతి. అలాగే వెక్కిరిస్తుంది." వా.
 • 2. ఒక పిల్లల ఆట.
 • "దాగిలిమూతలు...గురిగింజ కొండకోతి." హంస. 3. 146.
 • ఇలా కొండతో చేరి అక్కడి - కొండలోని - అనే అర్థంలో చాలా పదా లున్నవి. కొండ కంది, కొండకాకి, కొండగుమ్ముడు, కొండగొఱ్ఱె...ఇత్యాదులు. ప్రత్యేకించి విశేషార్థ మున్న వే ఇట ఉట్టంకి