పుట:PadabhamdhaParijathamu.djvu/541

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కైంక____కైకొ 517 కైకొ____కైచె


కైంకర్యము చేయు

 • కాజేయు; సేవ చేయు.
 • సేవ చేయు అసలు అర్థం అయినా వ్యంగ్యంగా కాజేయు అనే అర్థంలోనే ఉపయోగిస్తారు. వైష్ణవులలో మాత్రం మంచి అర్థంలోనే ఇది అలవాటులో ఉంది.
 • "వాడు ఇంట్లో ఉన్నట్టే ఉండి, పెట్టెలో నాలుగు రూపాయలూ కైంకర్యం చేశాడు." వా.

కై కానుక చేయు

 • కానుక లిచ్చు.
 • "జవాదిపిల్లులు మొదల్గా గానలో వాని గుం, పులు గైకానుక చేసి.." యయా. 1. 104.
 • చూ. కైకాన్క సేయు.

కైకాన్క సేయు

 • బహుమతి యిచ్చు.
 • "గుండ్ల పేరును కైకాన్క కోరి సేతు." హంస. 2. 37.
 • చూ.కైకానుక చేయు.

కైకూలి వడు

 • దినకూలి చేసుకొని బ్రతుకు; కూలి నాలి చేసుకొను.
 • "కొడవలి గడియించుకొనుచు గై కూలి, వడి రాజనములకు నొడ బాటు చేసి." బస. 4. 117.

కై కొను

 • 1. గ్రహించు.
 • "జగత్త్రయంబు గావం బ్రోవం, గైకొన్ననీవు." ఉత్త. హరి. 4. 96.
 • 2. లక్ష్యపెట్టు.
 • "కైకో డతండు సురల." హర. 3. 8.
 • 3. పెండ్లి చేసుకొను.
 • "జయలక్ష్మీసతితో ననంగవతి నిచ్చం గైకొనం గోరి..." విక్ర. 4. 54.
 • 4. పట్టు, అనుసరించు.
 • "చరమాశాంతరవీధి గైకొని." విక్ర. 2. 115.
 • ఇలాంటి ఇతర చ్ఛాయలలోనూ ప్రయుక్తం. అవన్నీ వీనిలోనే చేరనూ చేరును.

కై కొలుపు

 • ఒప్పించు; ధైర్యము గొల్పు.

కై కొల్పు

 • పురికొల్పు. భాగ. 10. ఉ. 300.

కై కోలు

 • ప్రతిజ్ఞ; సమ్మతి; అనుమతి.
 • "నా కై,కో లిదె రెం డాడగ నా, నాలుక మీకులము వారి నాలుక లటులే?" సింహా. 5. 198.

కై చాపు

 • నమస్కరించు.

కై చెఱ యిచ్చు.

 • తనంత పట్టుబడు, వశ మగు.
 • "ఏచిన తన నిడువాలు వి,లోచనముల చెలువమునకు లొంగి జలజముల్, కై చెఱ యిచ్చె ననం గే, లీచాలితనళిన మా కలికి ధరియించున్." వరాహ. 11. 50.