పుట:PadabhamdhaParijathamu.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అఖి________అగ 25 అగ_________అగ

అఖిలంబులకు వచ్చునట్లు

  • సర్వార్థ సాధక మగునట్లు, ఇహపర సాధకంగా.
  • అన్నిటికీ పనికివచ్చునట్లు అని అర్థము.
  • "అత్తెఱం గఖిలంబులకు వచ్చు నట్లు గా విన్న వించెద." పాండు. 1. 98.

అఖిలనియోగంబు

  • డెబ్భై రెండు నియోగముల వారున్నూ; గ్రామంలోని అన్ని వృత్తులవారున్నూ.
  • "అఖిలనియోగంబు గొలువ నన్న రేంద్రుండు." బస. 6. అ. 170 పుట.

అఖిలాండకోట్లు

  • అనేక బ్రహ్మాండములు; అఖిలాండకోటి బ్రహ్మాండాలు.
  • "ఆ వనజజు డంత నిఖిలాండకోట్లు గాలించి గాలించి."
  • పండితా. ప్రథ. పాద. పుట. 611.

అగచాట్ల పోతు

  • కష్టుడు.

అగచాట్ల మారి

  • కష్టుడు.
  • చూ. అగచాట్లపోతు.

అగచాట్లు

  • కష్టాలు.
  • "దైవమా! యిటువంటి యగచాట్లు పగ వారికైనం దగవుసుమీ యని."
  • ఉత్తర. రామా. 6. 343.
  • "ఎన్నో అగచాట్లు పడి ఈనాటికి కాస్త నిలవదొక్కు కున్నాము." వా.

అగడు పెట్టు

  • అల్లరి పెట్టు, అగుడు అనే రూపమే వాడుకలో విన వస్తుంది.
  • "వాడు ఊరికే అగుడు పెడుతున్నాడు." వా.

అగడుకాకి

  • ఆక తాయి.
  • "అగడలు మహాధూర్తు లగడుకాకులు." హరి. 5. 10.
  • "వాడు ఒట్టి అగడుకాకి. అల్లరిపెట్టే స్తాడు." వా.

అగడు చేయు

  • అల్లరి పెట్టు.
  • "వాడు నలుగురిలో ఊరికే న న్నగుడు చేస్తున్నాడు." వా.

అగడువడు

  • పదిమందినోళ్లలో పడు. చెడ్డ పేరు తెచ్చుకొను.
  • "అగడువడి పడి పడసినయట్టి పసిడి." విప్ర. 3. 17.
  • "ఆ అత్త, కోడలు అంతా తినేస్తూ ఉందో అని ఊరికే అగుడు పెడుతుంది." వా.
  • "అగుడు మొగుడిపాలు అనుభవం మిండ గాడిపాలు." సా.

అగడు సేయు

  • అల్లరి పెట్టు.
  • "ఏ లగడు సే సెదు రచ్చల బెట్టి యింత." సారం. 3. 13.

అగతికంగా

  • మరోదారి లేక.