పుట:PadabhamdhaParijathamu.djvu/506

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుందా____కుందె 482 కుందె____కుంప

  • తరువాత మనోజ్ఞతకు కూడా పర్యాయ మైనది.
  • బంగారు కమ్మిని కమ్మెచ్చులో తీసినపుడు తొలి నుంచీ తుదిదాకా ఒకే తీరులో ఉంటుంది. దానిమీద వచ్చిన పలుకుబడి.
  • "కుందనపు గమ్మి దిగిచిన, యందమున." కళా. 2. 33.
  • చూ. కమ్మెచ్చున తీసినట్లు.

కుందార్చు

  • దు:ఖము తీర్చు.
  • "అరసి దు:ఖాక్రాంత యైనరుక్మిణిని, గర మర్థి గుందార్చె గమలలోచనుడు." ద్విప. కల్యా. 130.

కుందికట్టు

  • ఒక పిల్లల ఆట. యయా. 3. 55.

కుంది కుట్టాడు

  • ఉన్న చోటు వదలక పడిఉండు.
  • "ఇంటిలోనే రాత్రింబవళ్ళు కుంది కుట్టాడు దేల?" తె. జా.

కుందెటికొమ్ము

  • అసంభవ మైనది.
  • కుం దేలుకు కొమ్ముండదు గనుక అలా ఏర్పడినది.
  • "వసుధన్ గుందెటికొమ్ము తెచ్చుకొనగా వచ్చున్ బ్రయత్నంబునన్." మల్లభూ. నీతి. 5.
  • చూ. కుందేటికొమ్ము.

కుందెనగిఱి

  • పిల్లల ఆట.

కుందెనగుడి

  • ఒక పిల్లల ఆట. కాళ. 3. 33.

కుందేటికొమ్ము

  • అసంభవము, అసత్యము.
  • కుందేటికి కొమ్ము లుండవు కనుక, సంస్కృతంలో దీనినే శశవిషాణం అంటారు. వంధ్యాపుత్రుడు. గగన పుష్పము ఇత్యాదుల వంటిది.

'*"తిరిగి కుందేటికొమ్ము సాధింప వచ్చు, జేరి మూర్ఖునిమనసు రంజింప రాదు." భర్తృ. సు. నీతి.

  • చూ. కుందెటికొమ్ము.

కుంపటి పెట్టు

  • తగాదా పెట్టు, ఏదో ఒక అనాహూతము తెచ్చి పెట్టు.
  • "వా ణ్ణేదో మాటసామెతకు ఇంటికి రమ్మంటే నే నక్కడ చేసిన వన్నీ నా భార్యతో చెప్పి కుంపటి పెట్టి పోయాడు." వా.

కుంపటిలో తామర మొలిచినట్లు

  • తగనితావున ఉన్న మంచి వస్తువు పట్ల అనే పలుకుబడి. కుంపటిలో పెట్టిన మొక్కలకు బాగా నీరు పోసి ఎరువు వేసి పెంచుతారు. అందుకే అవి చాలా ఏపుగా