పుట:PadabhamdhaParijathamu.djvu/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్ష_________అక్షి 24 అక్షి_________అఖ

అక్షరాలా

  • పూర్తిగా.
  • పత్రాలు వాటిల్లో రూపాయలను అంకెలతో వేసి అక్షరాలా యిన్ని రూపాయలు అని యిక దిద్దుటకు వీలు లేకుండా వ్రాశేవారు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వాడు చెప్పిం దంతా అక్షరాలా నిజం." వా.

అక్షరాలు

  • 1. చదువు, వ్రాత.
  • "వాడి కేవో నాలుగు అక్షరాలు వచ్చు."
  • "వాడి అక్షరాలు ముత్యాల కోవలా ఉంటాయి. నీ అక్షరాలేమో కోడి గీతలు." వా.
  • 2. లిపి.
  • తెలుగక్షరాలు, అరవ అక్షరాలు. వా.

అక్షరాలు కూడుకుంటూ

  • తడబడుతూ.
  • "వా డేదో అక్షరాలు కూడుకుంటూ చదవగలడు. అదీ పాండిత్య మేనా?" వా.

అక్షింతలు పడు

  • దూషణకు పాత్ర మగు.
  • "నిన్ను చేరదీస్తే నానెత్తిన నాలుగు అక్షింతలు పడడం తప్పితే జరగ బోయే దేముంది?" వ.

అక్షింతగింజలు పడు

  • పెండ్లి అగు.
  • "ఏదో ఆ పిల్ల నెత్తిన నాలుగు అక్షింత గింజలు పడితే నా బాధ్యత తీరిపోతుంది." వా.

అక్షింతలు వేయు

  • తిట్లు తిట్టు.
  • "వాడు వచ్చి నాలుగు అక్షింతలు వేసి పోయాడు." వా.

అక్షిగతు డగు

  • కంటబడు, ఒక కంట కనిపెట్ట దగు, అనగా విద్వేషి అగు.

అఖండదీపం

  • దేవాలయంలో ఏ క్షణం లోనూ ఆరిపోకుండా పెట్టే దీపం.
  • "వైరిమదాంధ కారమున కఖండ దీపముగ జేసి." నిర్వ. ఉత్త. 1. 3.
  • "మా ఊళ్లో శివాలయంలో అఖండ దీపాలు ఎప్పుడూ వెలుగుతూంటాయి." వా.

అఖండదీపారాధన

  • దేవాలయంలో అఖండదీపాలు పెట్టుట.
  • "అఖండ దీపారాధనకుగా రెండు ఆవులను ఆలయానికి దానం చేశారు." వా.
  • చూ. అఖండదీపం.

అఖండ మైన

  • అతిసునిశిత మైన.
  • "వాడు అఖండ ప్రజ్ఞ కలవాడు. వాడు అఖండప్రతిభాశాలి. వానివి అఖండమైన తెలివి తేటలు." వా.

అఖండుడు

  • కూలంకషప్రజ్ఞ కలవాడు.
  • "వాడు వ్యాకరణ శాస్త్రంలో అఖండుడు. వాణ్ణి తప్పు పట్టాలంటే పతంజలే దిగి రావాలి." వా.