పుట:PadabhamdhaParijathamu.djvu/440

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కర్మ____కఱ 414 కఱ____కఱ

కర్మచండాలుడు

 • చండాలుడు కాకపోయినా పనులచే చండాలు డయిన వాడు.
 • "చక్కన ముచ్చట్లు జరపగ నేల, యిక్కర్మచండాలు రెంతటివారు." బస. 7. 188.
 • "వాడు జన్మత: పెద్ద వంశంవాడే. అయితే నేం కర్మచండాలుడు." వా.

కర్మ చాలక

 • దురదృష్టవశాత్తు.
 • "కర్మ చాలక అక్కడికి వెళ్లాను, అన్ని మాటలు తిన్నాను." వా.

కఱకరి (ఱి) పెట్టు

 • నిర్బంధ పెట్టు.
 • "కఱకఱి పెట్టి సొ మ్మడుగు." ఆము. 5. 61.

కుఱకుట్లు, చంకలో పొత్తములు

 • అంది పొందని నడవడి; కపట వర్తనము అనుపట్ల ఉపయోగించే సామ్యము. మాంసపు ముక్కలనూ, పుస్తకాలనూ చంకలో పెట్టుకోవడం ఎలా కుదురుతుంది?
 • "...తగునే కఱకుట్లును జంక బొత్తముల్." ఉ. హరి. 2. 137.

కఱకుమాటలు

 • కఠినోక్తులు. శృం. నైష. 7. 93.

కఱకు లాడు

 • కఠినోక్తు లాడు.

కఱకొను

 • గట్టిపడు; నిలుచు.
 • "గుఱుకొని చేసినయఘములు, కఱకొని దృఢవజ్రలేపకం బగు దరుణీ." పద్మ. 3. 88.

కఱగొఱ

 • అఱకొఱ; అవమానము.
 • "కడిందిగ జూడకు నీకు నేమియుం, గఱగొఱ గాదు." భార. ద్రోణ. 3. 223.
 • "చాలమి దెచ్చుకొన్న నా, కఱగొఱ దీర్తు గాక." కకు. 5. 34.

కఱతలయోగి

 • పరమపదము నందుకొన్న యోగి.
 • కఱ - తీరము. (తమి) ఆఖరు మెట్టు చేరినవా డనుట.
 • "కఱతలయోగిని కర్మ మంటునా!" తాళ్ల. సం. 7. 211.

కఱతలాడు

 • విజ్ఞుడు నేర్పరి.
 • "ఉపనిషత్ప్రపంచంబు, గడదాక నెఱిగిన కఱతలాని...గాంచి." కాశీ. 2. 160.
 • చూ. కఱతలయోగి.

కఱదూపము

 • పొయినుండీ వచ్చే నల్లని పొగ.
 • "విరహ పరితాప వేదన వేగుచున్న, చక్రవాకాంగనల కటాక్షముల యగ్గి, నావహిల్లిన కఱదూప మనగ నొప్పు, నుడుగణాధీశబింబంబు నడిమిమచ్చ." భీమ. 2. 45.