పుట:PadabhamdhaParijathamu.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంత_______అంత 14 అంతు________అంతూ

  • ఔను, నీ వంతవాడవే నాయనా." వా.

అంతశయ్య

  • మరణశయ్య.
  • "వాడు మంచం పట్టాడు. అది యింక అంతశయ్యే."
  • "వాడు అంతశయ్యమీద ఉండి చెప్పిన మాటలను మనం అంతలోనే మరిచిపోవడం న్యాయం కాదు." వా.

అంతశ్శీతం

  • మనస్పర్ధ; అఱకొఱలు.
  • వైద్య శాస్త్రరీత్యా వచ్చిన పలుకుబడి. లోపల శీతం చేరుకుని తిన్నగా అది శరీరాన్ని లొంగదీసే జబ్బుగా మారుతుంది.
  • "వాళ్లల్లో ఈమధ్య అంతశ్శీతం బయలు దేరింది." వా.

అంతసేపు

  • చాలసేపు.
  • "అక్కడికి వెళ్లి అంతసేపు కూర్చుంటే ఇక్కడిపని అంతా ఎవరు చేస్తా రను కొన్నావు."
  • "ఎక్కడికి వెళ్లినా అంతసేపు చేస్తూ ఉంటే నీకు పని చెప్పడానికే భయంగా ఉంది." వా.

అంత సేయు

  • అనుకొనుటకు వీలు కానంత పని చేయు.
  • "మొన్న మేరుగిరిపాటి నిశాచరి నంత సేసె, నే డేపున గట్టు బండి నిదె యిందఱు జూడగ నింత సేసె>"
  • వి. పు. 7. 83.
  • "అంతపని చేశాడా వాడు? వాడు అంత పని చేస్తా డని నే ననుకోలేదు." వా.

అంతు కనుక్కొను

  • తుది మొదలు చూచు, గుట్టూ మట్టూ తెలిసికొను.
  • "ఈ వ్యవహారంలో అంతు కనుక్కు నే దాకా నేను వదల దలచుకో లేదు."
  • " వా డింతకు వచ్చాడూ? వాడి అంతు ఏదో కనుక్కొంటాను." వా.

అంతచిక్కు

  • చూ. అంతుపట్టు.

అంతుదొరకు

  • చూ. అంతుపట్టు.

అంతుపట్టు

  • లోతుపాతులు తెలియు.
  • నా. మా. 106.

అంతు పంతు

  • మొదలు కొన. జం.
  • "వీడి దుర్మార్గానికి అంతూ పంతూ లేకుండా పోయింది." వా.

అంతు పొంతు లేదు

  • అనంతము.
  • "అంతును బొంతునుం గలదె యమ్మరొ." నానా. 207.

అంతు పంతు లేక

  • అడ్డీ ఆగీ లేక.
  • "అంత కంత కది యంతును పంతును లేక వర్ధి లెన్." పాణి. 1. 104.

అంతూ యింతూ

  • మొత్తంమీద.
  • "అంతూ యింతూ వాడు రా డనేగా నీ వనేది?" వా.