పుట:PadabhamdhaParijathamu.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంత________అంత 13 అంత_________అంత

అంతమనిషి

  • అంత యోగ్యత కలవాడు. అంతపని చేయగలవాడు.
  • "అంతమనిషి యిలా చేస్తా డని నే ననుకోలేదు."
  • "వా డంతమని షయితే యింకేమమ్మా! నేను హాయిగా ఉందును."
  • "వాడు అంతమనిషి ఎప్పు డయ్యాడు? నాకే ఎసరు పెట్టాడూ?"
  • "వా డంతమనిషని నే ననుకో లేదు." వా.

అంత మాట

  • అనరాని మాట.
  • "వాడు అంతమాట అన్నాడా? అంత మా టన్నాడూ వాడు?" వా.

అంతరపల్లటీ

  • పైన గిరికీలు కొట్టేపావురము దానిద్వారా గిరికీలు కొట్టుటకు కూడా వాచక మయినది.
  • "వాడు అంతరపల్లటీ కొడుతున్నాడు." వా.

అంతర మెఱుగనివాడు

  • తారతమ్యజ్ఞానం లేనివాడు.
  • "వానికి పెద్దాసిన్నా అంతరం తెలియదు."
  • "అంతర మెరుగనివాడు వానిజోలికి ఎవరు పోతారు?" వా.

అంతరువు

  • యోగ్యత, అంతరము.
  • "నీ అంతరు వేమి? నా అంతరు వేమి? నీతో నాకు వాద మేమిటి?" వా.

అంతర్ధానంబు సేయు

  • అదృశ్య మగు.
  • కాశీ. 6. 138.

అంతర్మదాలు

  • అయిదు అంతర్మదాలు. సం యాదులు.
  • "సమ్యాది పంచ విధాంతర్మదంబులు."
  • కుమా. 11. 137.

అంతల పొంతలవారు

  • చుట్టాలు.
  • "అంతలపొంతలవా రున్న ఊళ్లో అంతో యింతో ఉంటే గాని మర్యాదగా ఉండదు."" వా.

అంత వట్టు

  • యావత్తు.
  • ఒట్టు మొత్త మని, లెక్కలలో వెరసి అనే అర్థంలో ఉపయోగిస్తారు.

అంత వట్టువారు

  • అంతంత గొప్పవారు.
  • "అంతవట్టువారును...గూలిరి."
  • భార. శల్య. 2. 135.

అంతవాడు

  • అంత యోగ్యత కలవాడు.
  • "అంతవాణ్ణి బజారులో నిలదీసి అది అడిగిన మాటలు అబ్బ! వినలేము." వా.

అంతవాడవే

  • ఔను, నీవు ఆపని చేయగల వాడవే. ఎవ డైనా తన్ను గూర్చి చెప్పుకొంటున్నప్పుడు ఔ నంటూ ఎదుటివాడు ఆడు మాటలు.
  • "అనుటయు నంతవాడ వె కదా యని మిక్కిలి గారవించి." పారి. 2. 76.